AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపట్నుంచే ప్రభుత్వ బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. ఈసారైనా గట్టెక్కుతారా?

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) పరీక్షలు ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే..

రేపట్నుంచే ప్రభుత్వ బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. ఈసారైనా గట్టెక్కుతారా?
AP Special TET Exams
Srilakshmi C
|

Updated on: Aug 04, 2026 | 7:43 PM

Share

అమరావతి, ఆగస్ట్‌ 4: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) పరీక్షలు బుధవారం (ఆగస్టు 5) నుంచి ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు విడతల్లో జరుగుతాయి. ఆగస్ట్ 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రేపట్నుంచి మొదలయ్యేది స్పెషల్‌ టెట్‌ పరీక్షలు. అంటే సర్వీసులో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు మాత్రమే నిర్వహించే పరీక్షలన్నమాట. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో స్పష్టంగా లేకపోతే, ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు లేదా బ్యాంక్ పాస్‌బుక్ వంటి గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని వెంట తీసుకురావాలని తెలిపారు.

వికలాంగ అభ్యర్థులకు సూచనలు

పీహెచ్‌సీ (దివ్యాంగ) అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ వివరాలను పీహెచ్‌సీగా నమోదు చేయకపోతే, జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి తీసుకుని సహాయకుడి (స్క్రైబ్) సదుపాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని అభ్యర్థులను హెచ్చరించారు. పరీక్ష నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన సందేహాలు, ఇతర వివరాల కోసం అభ్యర్థులు ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 93980 44628 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించి, అవసరమైన పత్రాలతో ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది.

ఇవి కూడా చదవండి

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో 2011 సంవత్సరం కంటే ముందు ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాల్సి ఉంటుంది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్‌ రద్దు చేయాలని, దానిని రద్దు చేసేలోపు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు మరోమారు టీచర్లకు టెట్‌ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక టీచర్లకు ఏపీ సర్కార్‌ యేటా రెండు సార్లు స్పెషల్ టెట్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Follow Us
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!