Turmeric Prosperity: పసుపును ఇలా వినియోగిస్తే ఆరోగ్యమే కాదు.. ఐశ్యర్యమూ సిద్ధిస్తుంది.. అదెలాగో ఇక్కడ చూడండి..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 05, 2021 | 7:01 AM

Turmeric Prosperity: సనాతన సంప్రదాయంలో పసుపు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ప్రతీ శుభకార్యంలోనూ పసుపును వినియోగిస్తారు. జ్యోతిష్యం, ఆయుర్వేద పరంగా..

Turmeric Prosperity: పసుపును ఇలా వినియోగిస్తే ఆరోగ్యమే కాదు.. ఐశ్యర్యమూ సిద్ధిస్తుంది.. అదెలాగో ఇక్కడ చూడండి..
Turmeric

Turmeric Prosperity: సనాతన సంప్రదాయంలో పసుపు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ప్రతీ శుభకార్యంలోనూ పసుపును వినియోగిస్తారు. జ్యోతిష్యం, ఆయుర్వేద పరంగా పసుపు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. కాలానుగుణమైన అన్ని అడ్డంకుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీ అదృష్టాన్ని పెంచుతుంది. వాస్తవానికి పసుపు బృహస్పతికి సంబంధించినది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకునే వారు పూజ మొదలు.. ఆహారం, తాగే నీటిలోనూ పసుపును వినియోగించాల్సిన అవసరం ఉంది. మీ జాతకంలో బృహస్పతికి సంబంధించి బలహీనతగా ఉంటే.. పసుపు వినియోగం ఎంతో ఉపయోగకరం అని చెప్పాలి. అసలు పసుపు వల్ల మనుషులకు జరిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

1.దేవగురువు బృహస్పతి ఆశీస్సులు పొందడానికి మీరు పూజలో పసుపును ఉపయోగించాలి. నుదిటిపై తిలకం రూపంలో ధరించాలి. ప్రసాదం రూపంలో చిటికెడు పసుపును ఆరగించాలి. 2. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ప్రతీ గురువారం పసుపు నీటిని ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం ద్వారా, ఆ మహా విష్ణువు ఆశీర్వాదాలతో పాటు.. లక్ష్మీ దేవి కూడా కటాక్షిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. 3. మీ వివాహంలో జాప్యం జరిగినా.. పెళ్లి విషయం మరింత దిగజారిపోతున్నా.. ప్రత్యేకించి గురువారం నాడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయాలి. 4. విష్ణుమూర్తికి పసుపు దండ చాలా ప్రియమైనది. ఈ నేపథ్యంలో గురువారం నాడు విష్ణు, దేవగురు బృహస్పతి మంత్రాన్ని జపించాలి. పసుపు హారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆ మంత్రం సత్ఫలితాలనిస్తుంది. విష్ణువు, బృహస్పతుల దీవెనలు లభిస్తాయి. 5. మీరు కెరీర్, వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందలేకపోతే, నిరంతర అడ్డంకులు ఉన్నట్లయితే మీరు దేవగురు బృహస్పతి మంత్రాలతో పూజించిన పసుపు దండను ధరించాలి. 6. మీ వైవాహిక జీవితంపై ఇతరులు దృష్టి పడుతున్నట్లు మీకు అనిపిస్తే.. మీ జీవిత భాగస్వామి ప్రేమను కాపాడుకోవడానికి ఇంటి వెలుపల గోడపై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా చేయడం ద్వా మీ సంతోషకరమైన వైవాహిక జీవితంపై ఎవరి కన్ను పడదు.

Also read:

Suicide: ఊరెళ్లే విషయంలో దంపతుల మధ్య వివాదం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పెళ్లైన పది నెలలకే.

Numerology: మీ జీవిత భాగస్వామి స్వభావం, లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇది చూడండి..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu