Suicide: ఊరెళ్లే విషయంలో దంపతుల మధ్య వివాదం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పెళ్లైన పది నెలలకే.

Suicide: దంపతుల మధ్య నెలకొనే చిన్న చిన్న తగాదాలు కొన్ని సందర్భాల్లో తీవ్ర నిర్ణయాలకు దారి తీస్తుంటాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంటాయి. తాజాగా...

Suicide: ఊరెళ్లే విషయంలో దంపతుల మధ్య వివాదం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పెళ్లైన పది నెలలకే.
Women Suicide
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 05, 2021 | 6:36 AM

Suicide: దంపతుల మధ్య నెలకొనే చిన్న చిన్న తగాదాలు కొన్ని సందర్భాల్లో తీవ్ర నిర్ణయాలకు దారి తీస్తుంటాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంటాయి. తాజాగా ఓ వివాహిత క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటకు చెందిన బ్రహ్మానందం, రాజమణి కుటుంబం కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో ఉంటోంది. వీరికి ప్రియాంక (28) అనే కుమార్తే ఉంది. గతేడాది నవంబర్‌లో హన్మకొండకు చెందిన మందుగుల అన్వేష్‌తో వివాహం చేశారు.

వీరిద్దరూ కూకట్‌పల్లిలోని స్వాన్‌లేక్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే కావడంతో ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌లోనే ఉంటూ.. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ చేస్తున్నారు. ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఊరికివెళ్లే విషయంలో తాజాగా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. శుక్రవారం భార్యను హన్మకొండకు రావాల్సిందిగా అన్వేష్‌ భార్యను కోరాడు. అయితే దానికి ప్రియాంక రాను చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. తర్వాత ఇద్దరూ చేరో గదిలో నిద్రపోయారు. ఉదయం లేచి చూసేరికి ప్రియాంక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియాంక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు అన్వేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Dieting Food : ఈ ఆహారం తింటే నిజంగా బరువు పెరుగుతారా? అసలు వాస్తవాలివి అంటున్న నిపుణులు..

Telangana : ట్రాఫిక్ పోలీసులకు వీరు కనిపించరా? ఆ నిబంధనలు పేదలకే మాత్రమేనా?.. ప్రశ్నిస్తున్న ప్రజలు..

Andhra Pradesh: నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళ, డాక్టర్..