AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: మీ జీవిత భాగస్వామి స్వభావం, లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇది చూడండి..

Numerology: సంఖ్యాశాస్త్రం ద్వారా వ్యక్తుల బలాలు, లోపాలు, వారి స్వభావం గురించి సులభంగా తెలుసుకోవచ్చు. మీరు మీ భాగస్వామి లక్షణాలు, స్వభావం ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే..

Numerology: మీ జీవిత భాగస్వామి స్వభావం, లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇది చూడండి..
Numerology
Shiva Prajapati
|

Updated on: Sep 05, 2021 | 6:36 AM

Share

Numerology: సంఖ్యాశాస్త్రం ద్వారా వ్యక్తుల బలాలు, లోపాలు, వారి స్వభావం గురించి సులభంగా తెలుసుకోవచ్చు. మీరు మీ భాగస్వామి లక్షణాలు, స్వభావం ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే ఈ కథనంలో చూడొచ్చు. న్యూమరాలజీ అనేది ఒక శాస్త్రం. ఇందులో వ్యక్తి లక్షణాలు, స్వభావం, భవిష్యత్తును సంఖ్యల ద్వారా అంచనా వేయబడతాయి. దీని ఆధారం బేస్ సంఖ్య. ఇందులో ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ తొమ్మిది సంఖ్యలన్నింటికీ ప్రతినిధి గ్రహం ఉంది. ఆ గ్రహం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దాని ఆధారంగా వారి పురోగతి, స్వభావం మొదలైనవి అంచనా వేయబడతాయి. 01 నుండి 09 వరకు న్యూమరాలజీ సహాయంతో ఎవరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

నెంబర్ 1 : ఈ సంఖ్యలోని వ్యక్తులు ఇతరులకు ఎల్లప్పుడూ సహకరిస్తుంటారు. తమను తాము నియంత్రించుకుంటారు. ఇలాంటి వ్యక్తులు సమాజంతో గౌరవించబడుతారు. ఎదుటివారు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. వారిని సంతోషంగా చూసేందుకు ప్రయత్నిస్తారు. నవ్విస్తుంటారు. అయితే, దీని కారణంగా వారి వాస్తవ స్థితిని గుర్తించడం కష్టం. వీరు లోపల ఎంత బాధపడుతున్నప్పటికీ.. వారి బాధ ఎప్పటికీ బయటకు కనిపించదు.

నెంబర్ 2 : సారథ్యం అనేది వీరిలో ఉండే అతిపెద్ద క్వాలిటీ. వీరు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. కానీ ఇతరులను నిర్దేశించే అలవాటు కారణంగా.. వీరి వల్ల ఇతరులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఏమి చేయాలని నిర్ణయించుకున్నారో అదే చేస్తారు. కష్టాలకు ఎప్పుడూ భయపడరు.

నెంబర్ 3 : ఈ వ్యక్తులు మృదువైన స్వభావం, భావోద్వేగంతో ఉంటారు. వీరు తరచుగా తమ మనసును మార్చుకుంటారు. ఒక అంశంపై స్థిరంగా ఉండలేరు. ఎల్లప్పుడూ ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఆలోచిస్తుంటారు. వీరిలో అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. పరిస్థితి తగ్గట్లుగా క్షణాల్లోనే తమను తాము మలచుకుంటారు.

నెంబర్ 4 : సంకల్పం, సామర్థ్యం వీరి గుర్తింపు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో వీరు నిష్ణాతులు. ఎల్లప్పుడూ వారి కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు. నాలుగు నెంబర్లు అదృష్ట సంఖ్యగా కలిగిన ఉన్న వ్యక్తులు చాలా వరకు ధనవంతులై ఉంటారు.

నెంబర్ 5 : వీరు చాలా త్వరగా ఇతరులతో కలసిపోతారు. జీవితంలో అతిపెద్ద అడ్డంకి మీ లక్ష్యాలను సాధించకుండా నిరోధిస్తుంది. ఈ నంబర్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల అతిపెద్ద లక్షణం ఏంటంటే.. వారి జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దాని పరిష్కారం కోసం నిశ్శబ్దంగా వెతుకుతూనే ఉంటారు.

నెంబర్ 6 : ఈ సంఖ్యతో సంబంధం ఉన్న జీవితంలో తరచుగా ఊహించని రీతిలో పెద్ద సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయినప్పటికీ, వారు ఆ పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ నవ్వుతూ ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటారు.

నెంబర్ 7 : ఏడు ను లక్కీ నెంబర్‌గా కలిగిన వ్యక్తులు నిజంగా వండర్‌ అని చెప్పాలి. వీరు ఎంత మందిని కలుసుకుంటారో.. అంతగా వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ వారి ప్రయాణాన్ని ఆపబోరు. కొంచె వేగాన్ని తగ్గించి తాబేలు మాదిరిగానైనా లక్ష్యం వైపు కదులుతూ ఉంటారు. సహజంగా వీరికి కోపం రాదు.. కానీ కోపం వచ్చిందంటే తట్టుకోవడం ఎవరి వల్లా కాదు.

నెంబర్ 8 : వీరికి ఇతరులను ఆకర్షించే గుణం ఉంటుంది. వీరిని కలిసిన వ్యక్తులు అంత ఈజీగా మరిచిపోలేరు. ఎల్లప్పుడూ చలాకీగా ఉండటం వీరి ప్రత్యేక లక్షణం. వీరు మిత్రులకు మిత్రులు.. శత్రువులకు శత్రువులుగా ఉంటారు. ఇక్కడో మరో కీలకమైన విషయం ఏంటంటే.. శత్రువులపై కూడా ప్రేమాభిమానాలు చూపిస్తారు. వీరు తమ జీవితంలో ఏది కూడా సునాయాసంగా పొందలేరు. కానీ, చాలా పోరాటం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.

నెంబర్ 9 : ఈ నెంబర్ అదృష్ట సంఖ్యగా కలిగిన వ్యక్తుల ప్రత్యేక ఏంటంటే.. వారికి ఏదైనా ఇబ్బంది, అడ్డంకులు వచ్చినట్లయితే రెట్టింపు శక్తితో ఎదుర్కొంటారు. ఈ వ్యక్తులు తమ పనిని అసంపూర్తిగా వదిలిపెట్టరు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలచుకోవడంతో పాటు.. నాయకత్వం వహించే అద్భుతమైన సామర్థ్యం వీరి సొంతం.

Also read:

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Chhattisgarh: 7 గంటల్లో 101 మంది మహిళలకు గర్భనిరోధక ఆపరేషన్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..

Vinayaka Chaviti: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్.. అధికారుల తీరుని ఖండించిన బీజేపీ నేతలు