Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 05, 2021 | 6:32 AM

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇటీవల గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు ఉదయం స్వల్పంగా పెరిగాయి.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold Price

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇటీవల గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు ఉదయం స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ కొనాలకునేవారు కాస్త ఆలోచించి తీసుకోవాల్సిందే. అటు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే దేశీయంగా గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగితే మరికొన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు పెరిగాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ముందు ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా పసిడి ధరలు కొన్ని ప్రాంతాల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అటు దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,400కు చేరింది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,500 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.48,550కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,650కు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,900కు చేరింది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,400కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 47,400కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,960కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,050కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,500 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.48,550కు చేరింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.

Also Read: Viral Pic: పదే పదే ఇబ్బంది పెడుతున్న అడవి దున్న.. ఆగ్రహించిన తల్లి ఏనుగు.. ఊహించని రీతిలో..

Telangana : ట్రాఫిక్ పోలీసులకు వీరు కనిపించరా? ఆ నిబంధనలు పేదలకే మాత్రమేనా?.. ప్రశ్నిస్తున్న ప్రజలు..

Andhra Pradesh: నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళ, డాక్టర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu