Viral Pic: పదే పదే ఇబ్బంది పెడుతున్న అడవి దున్న.. ఆగ్రహించిన తల్లి ఏనుగు.. ఊహించని రీతిలో..

Viral Pic: అడవికి రాజు సింహం. కానీ సింహానికి మించిన జంతువు మరొకటి ఉంది. దాని ముందు మిగిలిన జంతువులు మౌనంగా ఉండడమే మంచిదని భావిస్తుంటాయి. అదే ఏనుగు.

Viral Pic: పదే పదే ఇబ్బంది పెడుతున్న అడవి దున్న.. ఆగ్రహించిన తల్లి ఏనుగు.. ఊహించని రీతిలో..
Elephant
Follow us

|

Updated on: Sep 05, 2021 | 6:28 AM

Viral Pic: అడవికి రాజు సింహం. కానీ సింహానికి మించిన జంతువు మరొకటి ఉంది. దాని ముందు మిగిలిన జంతువులు మౌనంగా ఉండడమే మంచిదని భావిస్తుంటాయి. అదే ఏనుగు. భారీ ఖాయంతో అడవిలోనే అదిపెద్ద జీవిగా ఉంది ఏనుగు. అందుకే చాలా మంది అడవికి నిజమైన రాజు ఏనుగు అని భావిస్తుంటారు. దీనికి నిదర్శనమై ఘటన తాలూకు ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. తాజా ఏనుగు, గేదెకు మధ్య జరిగిన పోరాటాన్ని చూస్తే షాక్ అవడం ఖాయం. అడవిలో ఏనుగును మించింది లేదని అర్థం అవుతుంది. అది ప్రశాంతంగా ఉన్నంత వరకే రాజ్యం ఎవరిదైనా.. దానికి ఆగ్రహం వచ్చిందో అది సింహమైనా.. మరేదైనా చుక్కలు కనిపించడం ఖాయం. ఏనుగు శక్తి ముందు మిగతా జంతువులన్నీ మోకరిల్లాల్సిందే.

అయితే, తాజాగా వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన ఘోరమైన ఫోటో ఒకటి నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఈ ఫోటోలో ఓ ఏనుగు.. గేదెపై తీవ్రంగా దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. సుమారు 500 కేజీల బరువు ఉండే గేదెను తన కొమ్ములు, తొండంతో కుమ్మేసింది ఏనుగు. కెన్యాలోని ఫారెస్ట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనను ఓ టూరిస్ట్ తన కెమెరాలో బందించాడు. వాస్తవానికి ఈ ఫోటో కనిపించే గేదె.. ఏనుగు పిల్లపై దాడి చేయబోయిందట. దాంతో తల్లి ఏనుగుకు కోపం కట్టలు తెంచుకుంది. గేదెపై దాడి చేసింది. కొమ్ములతో వీర కుమ్ముడు కుమ్మేసింది. పైకి లేపి ఎత్తేసింది. ఈ ఫోటోను గ్రీన్ ప్లానెట్ అనే ట్విట్టర్ యూజర్ అకౌంట్‌లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఏనుగు కోపం ఎంతటి ప్రమాదకరమో మరోసారి నిరూపితమైందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మనుషులైనా.. జంతువులైనా.. తమ పిల్లల జోలికి వస్తే ఏ తల్లి కూడా చూస్తూ ఊరుకోబోదని చెప్పడానికి ఇది మచ్చుతునక అని పేర్కొంటున్నారు యూజర్లు.

Viral Pic:

Also read:

JioPhone Next: సామాన్యులకు అందుబాటులో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకే..

Dieting Food : ఈ ఆహారం తింటే నిజంగా బరువు పెరుగుతారా? అసలు వాస్తవాలివి అంటున్న నిపుణులు..

Telangana : ట్రాఫిక్ పోలీసులకు వీరు కనిపించరా? ఆ నిబంధనలు పేదలకే మాత్రమేనా?.. ప్రశ్నిస్తున్న ప్రజలు..