JioPhone Next: సామాన్యులకు అందుబాటులో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకే..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 05, 2021 | 6:21 AM

JioPhone Next: రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందులో బాగంగా కస్టమర్లను ఆకట్టుకునేలా..

JioPhone Next: సామాన్యులకు అందుబాటులో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకే..
Jio

Follow us on

JioPhone Next: రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందులో బాగంగా కస్టమర్లను ఆకట్టుకునేలా జియో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆయిల్ టు టెలికాం సమ్మేళనం-2021 సందర్భంగా జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ ఫోన్ భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా పరిగణించబడుతుంది.

జియోనెక్ట్స్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు.. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా జియో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు రిలయన్స్ గతంలో ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ సెప్టెంబర్ 10 2021గా నిర్ణయించారు. రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఉన్నాయి. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ ఫోటోలను రిలియన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో విడుదల చేశారు. హెచ్‌డీ రిజల్యూషన్‌తో 5.5 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది సామాన్యుల బడ్జెట్‌లోనే లభించే స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. కాగా, జియోఫోన్ నెక్ట్స్ యూపీఎస్.. దాని ధరపై ఆధారపడి ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధరను 3,499 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జియోఫోన్ నెక్ట్స్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరీజీ సామర్థ్యం కలిగి ఉంది. 4జీ సపోర్ట్ కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11తో పని చేస్తుందని జియో కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Also read:

Dieting Food : ఈ ఆహారం తింటే నిజంగా బరువు పెరుగుతారా? అసలు వాస్తవాలివి అంటున్న నిపుణులు..

Telangana : ట్రాఫిక్ పోలీసులకు వీరు కనిపించరా? ఆ నిబంధనలు పేదలకే మాత్రమేనా?.. ప్రశ్నిస్తున్న ప్రజలు..

Andhra Pradesh: నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళ, డాక్టర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu