Google Photos: గూగుల్ ఫోటోల నుంచి మీ ఫోటోలు డిలీట్ అయిపోయాయా..నో టెన్షన్.. ఇలా చేయడం.. మళ్ళీ వచ్చేస్తాయి!

మీ ఫోటోలు మరియు వీడియోలను బ్యాకప్ చేయడానికి గూగుల్ (Google) ఫోటోల యాప్ మంచి ఎంపిక. దాని సహాయంతో, ఫోటోలను ఎక్కడైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు.

Google Photos: గూగుల్ ఫోటోల నుంచి మీ ఫోటోలు డిలీట్ అయిపోయాయా..నో టెన్షన్.. ఇలా చేయడం.. మళ్ళీ వచ్చేస్తాయి!
Google Photos
Follow us

|

Updated on: Sep 05, 2021 | 9:17 AM

Google Photos: మీ ఫోటోలు మరియు వీడియోలను బ్యాకప్ చేయడానికి గూగుల్ (Google) ఫోటోల యాప్ మంచి ఎంపిక. దాని సహాయంతో, ఫోటోలను ఎక్కడైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు. Google ఫోటోలు యాప్ నుండి ఫోటోలను ముఖం, ప్రదేశం, సమయం వంటి అనేక ఆల్బమ్ ఎంపికలతో మనం వర్గీకరించి జాగ్రత్త పరుచుకోవచ్చు. దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతిఒక్కరికీ గూగుల్ ఫోటోల యాప్ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని ఫోన్ లలోను డిఫాల్ట్ యాప్ గా ఉంటుంది. మనం తీసుకున్న ఫోటోలు ఆటోమేటిక్ గా దానిలోకి వెళ్ళిపోతాయి. (ఒకవేళ ఆటోమేటిక్ ను డిసేబుల్ చేసి ఉంచకపోతే). ఇక్కడ మనం దాచుకున్న మన ఫోటోలు ఒక్కోసారి అనుకోకుండా డిలీట్ అయిపోతాయి. మనకు తెలియకుండా ఇది జరగవచ్చు. లేదా ఒక ఫోటో డిలీట్ చేయబోయి మరో ఫోటో పొరపాటున డిలీట్ చేయవచ్చు. అటునంటి పరిస్థితిలో డిలీట్ అయిన ఫోటోలను మనం రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం తొలగించే ఏదైనా ఫోటో ముందు ట్రాష్‌కు వెళుతుంది. దానిని 60 రోజుల లోపు తిరిగి పొందవచ్చు. అయితే దీనికోసం ముందుగానే మన గూగుల్ ఫోటోల యాప్ లో Google ఫోటోలు బ్యాకప్.. సింక్ యాక్టివేట్ చేసి ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ పని చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టాబ్లెట్, ఐఫోన్, ఐప్యాడ్ నుండి తొలగించిన ఫోటోలను తిరిగి పొందడం ఇలా..

  • ముందుగా మీ పరికరంలో Google ఫోటోల యాప్‌ని తెరవండి.
  • దీని తరువాత, దిగువ కుడి మూలలో చూపిన లైబ్రరీ విభాగంపై క్లిక్ చేయండి.
  • మీరు కోలుకోవాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోను శోధించండి.. ఎంచుకోండి.
  • దిగువ ఇచ్చిన పునరుద్ధరణ ఎంపికపై క్లిక్ చేయండి. దీని తర్వాత వీడియోలు, ఫోటోలు ఫోన్ ఫోటో గ్యాలరీ యాప్‌లో సేవ్ అయిపోతాయి.

కంప్యూటర్ నుంచి ఇలా..

  • అలాగే పర్సనల్ కంప్యూటర్‌లో దీన్ని చేయడానికి, ముందుగా మీ కంప్యూటర్ బ్రౌజర్‌కి వెళ్లి, https://photos.google.com/ ఎంటర్ చేయడం ద్వారా Google ఫోటోలను తెరవండి.
  • ఇప్పుడు ముందుకు సాగడానికి గూగుల్ ఐడితో సైన్ ఇన్ చేయండి.
  • ఇప్పుడు మీరు పునరుద్ధరించాలనుకుంటున్న చిత్రాలను ఎంచుకోండి. ఫోటోలను ఎంచుకున్న తర్వాత, ఎగువ ఎడమ మూలలో
  • ఇచ్చిన పునరుద్ధరించు బటన్‌పై క్లిక్ చేయండి. ఈ బటన్ ‘ట్రాష్ ఖాళీ’ బటన్ దగ్గర కనిపిస్తుంది.
  • ఇవన్నీ చేసిన తర్వాత, మీ ఫోటోలు ఆటోమేటిక్‌గా ఫోటో లైబ్రరీలో కనిపిస్తాయి.

Also Read: JioPhone Next: సామాన్యులకు అందుబాటులో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకే..

Electricity: నడుస్తుంటే చాలు కరెంట్ పుట్టేస్తుంది.. దీంతో ఎల్ఈడీ లైట్లు వెలిగించవచ్చు..