- Telugu News Photo Gallery Technology photos Redmi Launching New Smartphone Redmi 10 Prime Have A Look On Features And Price
Redmi 10 Prime: రూ. 15వేల లోపే 50 మెగా పిక్సెల్ కెమెరా.. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.
Redmi 10 Prime: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ రెడ్‌మీ తాజాగా రెడ్‌మీ 10 ప్రైమ్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. ..
Updated on: Sep 05, 2021 | 12:31 PM

అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లను పరిచయం చేసిన వాటిలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రెడ్‌మీ ఒకటి. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసిన ఈ కంపెనీ తాజాగా మరో స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.

రెడ్‌మీ 10 ప్రైమ్ పేరుతో రూపొందించిన ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళా ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ88తో నడుస్తుంది.

ఇందులో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.

4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 12,499, 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,499గా ఉంది.





























