‘గ్రేట్‌ స్విమ్‌’.. ఆ ఐదు చిరుతలు భయం వీడాయి.. ఒక్కటై దూకాయి! వీడియో

కెన్యాలోని మాసాయ్‌ మారా రిజర్వ్‌లో ఓ అద్భుతం జరిగింది. ఉధృతంగా ప్రవహిస్తోన్న నది. అయితే వరద మింగేస్తుంది.. లేదా భయంకరమైన మొసళ్లు మింగేస్తాయి. ఆ ఐదు చీతా సోదరులు భయం వీడాయి..కెన్యాలోని మాసాయ్‌ మారా రిజర్వ్‌లో ఓ అద్భుతం జరిగింది. ఉధృతంగా ప్రవహిస్తోన్న నది. అయితే వరద మింగేస్తుంది.. లేదా భయంకరమైన మొసళ్లు మింగేస్తాయి. ఆ ఐదు చీతా సోదరులు భయం వీడాయి.. ఒక్కటై ముందుకు దూకాయి. కట్‌ చేస్తే.. బెస్ట్‌ ఫొటోలు తీశావంటూ కెమెరామాన్‌కు ప్రశంసలందాయి. 2020 జనవరి.. కెన్యాలోని మాసాయ్‌ మారా నేషనల్‌ రిజర్వులో ఒకటే కుండపోత. తాలేక్‌ నది అయితే.. ఉగ్రరూపం దాల్చింది.. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో పోటెత్తింది.. అలాంటి టైంలో ఒడ్డుకు అటు వైపున ఐదు చీతాలు.. ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతున్నాయి.. ఎందుకంటే.. ఈ నదిని దాటాలనుకుని ప్రయత్నించిన జంతువులను.. అయితే వరద మింగేస్తుంది.. లేదా నదిలోని భయంకరమైన మొసళ్లు మింగేస్తాయి.. కానీ ఎలాగైనా నదిని దాటాలి.. ఎందుకంటే.. ఒడ్డుకు అవతల వాటి రాజ్యముంది.. ఆ ఐదుగురు స్నేహితులు పాలించే సామ్రాజ్యముంది.. భయం వీడాయి.. ఒక్కటై దూకాయి.. వరద ఉధృతిని తట్టుకున్నాయి.. కలిసికట్టుగా నదిని దాటాయి..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Wireless Charging: గాలితో ఫోన్ చార్జింగ్.. శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ.. వీడియో

Smart T-Shirt: గుండె వేగాన్ని చెప్పే ఇస్మార్ట్‌ టీ-షర్ట్‌.. వీడియో

Allu Arjun : బాలయ్య సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..

Click on your DTH Provider to Add TV9 Telugu