Chhattisgarh: 7 గంటల్లో 101 మంది మహిళలకు గర్భనిరోధక ఆపరేషన్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..

Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఓ వైద్యుడు కేవలం 7 గంటల్లో 101 మంది మహిళలకు గర్భనిరోధక శస్త్ర చికిత్స చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న

Chhattisgarh: 7 గంటల్లో 101 మంది మహిళలకు గర్భనిరోధక ఆపరేషన్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 05, 2021 | 6:30 AM

Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఓ వైద్యుడు కేవలం 7 గంటల్లో 101 మంది మహిళలకు గర్భనిరోధక శస్త్ర చికిత్స చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్జన్‌పై విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గుజా జిల్లాలోని మెయిన్‌పట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆగస్టు 27 న స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో సర్జన్ కేవలం 7 గంటల్లో 101 మంది మహిళలకు గర్భ నిరోధక శస్త్ర చికిత్సలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క రోజులో 30 మందికి మాత్రమే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ 101 ఆపరేషన్స్ చేయడం తీవ్ర వివాదమైంది. ఇదే అంశంపై స్థానిక వార్తాపత్రికలు ఆ శిబిరంలో అక్రమాలు జరిగాయని వార్తలు ప్రసారం చేశాయి. వాటి ఆధారంగా సంబంధిత శాఖ చర్యలు చేపట్టింది. సర్జన్, స్థానిక ఆరోగ్య అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

స్టెరిలైజేషన్ క్యాంప్‌కి సంబంధించి ఫిర్యాదులు వచ్చిన తరువాత విచారణకు ఆదేశించామని, దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ అలోక్ శుక్లా తెలిపారు. ‘‘ వైద్య శిబిరంలో ఒక (ప్రభుత్వ) సర్జన్ ద్వారా మొత్తం 101 శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ ప్రక్రియలో పాల్గొన్న మహిళలు సాధారణ స్థితిలోనే ఉన్నట్లు నివేదికు వచ్చాయి. అయితే, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక సర్జన్ ఒక్క రోజులో గరిష్టంగా 30 శస్త్రచికిత్సలు చేయాలి. కానీ 101 శస్త్రచికిత్సలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘించారో తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించడం జరిగింది.’’ అని శుక్లా చెప్పారు.

అయితే, ఈ స్టెరిలేజేషన్ క్యాంప్ సందర్భంగా జిల్లాలోని మూరుమూల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు. తాము చాలా దూరం నుంచి వచ్చామని, తరచూ ప్రయాణం చేయలేమని పేర్కొంటూ శస్త్రచికిత్స చేయాల్సిందిగా సదరు వైద్యులను మహిళలు వేడుకున్నారు. దాంతో ఆ క్యాంప్‌లోని సర్జన్, అధికారులు సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సర్గుజా సీఎంహెచ్ఓ కూడా తీవ్రంగా స్పందించారు. దీనిపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ‘‘ఆగస్టు 27 మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఎన్ని శస్త్రచికిత్సలు జరిగాయి. విచారణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి. దోషులుగా తేలిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.’’ అని సర్గుజా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సిసోడియా చెప్పారు.

ఇదిలాఉంటే.. 2014 సంవత్సరం నవంబర్‌లో బిలాస్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టెరిలైజేషన్ క్యాంప్‌ నిర్వహించారు. ఆ సమయంలో కనీసం 83 మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. వారిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉచిత స్టెరిలైజేషన్ క్యాంప్‌లపై విపరీతమైన ఆరోపణలు రావడం తీవ్ర కలకం రేపుతున్నాయి.

Also read:

Viral Pic: పదే పదే ఇబ్బంది పెడుతున్న అడవి దున్న.. ఆగ్రహించిన తల్లి ఏనుగు.. ఊహించని రీతిలో..

JioPhone Next: సామాన్యులకు అందుబాటులో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకే..

Dieting Food : ఈ ఆహారం తింటే నిజంగా బరువు పెరుగుతారా? అసలు వాస్తవాలివి అంటున్న నిపుణులు..