Teachers Day: మనలోని అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞాన కాంతులను నింపి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన గురువులకు టీచర్స్ డే విషెస్ చెప్పండిలా

Teachers Day 2021: డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురష్కరించుకుని  దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు తమ భవిష్యత్ ను అందంగా తీర్చి దిద్దిన..

Teachers Day: మనలోని అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞాన కాంతులను నింపి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన గురువులకు టీచర్స్ డే విషెస్ చెప్పండిలా
Teachers Day
Follow us

|

Updated on: Sep 05, 2021 | 7:56 AM

Teachers Day 2021: డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురష్కరించుకుని  దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు తమ భవిష్యత్ ను అందంగా తీర్చి దిద్దిన గురువుకు కృతఙ్ఞతలు తెలుపుతూ.. ఎవరికి నచ్చిన విధంగా వారు జరుపుకుంటారు. చిన్నతనంలో అక్షరాలను దిద్దించిన ఉపాధ్యాయుడి నుంచి పాఠశాలలో, కాలేజీలో తమకు చదువు చెప్పిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని ఈరోజు గుర్తు చేసుకుని.. తమ ఉన్నతికి బాటలు వేసినందుకు కృతఙ్ఞతలు తెలుపుతారు విద్యార్థులు.

ఈరోజున ఉపాధ్యాదినోత్సవం నిర్వహించుకోవడానికి కారణం డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణ. ఆయన సెప్టెంబర్ 5, 1888 న జన్మించారు.  భారత దేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ..  రెండవ ప్రెసిడెంట్. ఆయన జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం.

దేశాన్ని ఏలే రాజు అయినా ఒక గురువుకు శిష్యుడే.. మనలోని అజ్ఞానాన్ని.. విజ్ఞానంతో తొలగించి.. జీవితపు విలువలను తెలిపి.. బంగారు భవిష్యత్ కు పునాదులు వేసేది ఉపాధ్యాయులు. విలువలని, మంచి పద్ధతుల్ని, ఎన్నో మంచి గుణాలుని మనకి నేర్పిన ఉపాధ్యాయులను మనం ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే మర్చిపోలేము.  ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మీయొక్క గురువులకి విషెస్, మెసేజ్ లను చెప్పాలనుకుంటున్నారా.. అయితే కొన్ని విషేష్ ఐడియాలు మీ కోసం..

*ఉపాధ్యాయుడు గా మీరు నా జీవితానికి బంగారు బాట వేశారు. మీరు ఇచ్చిన జ్ఞానానికి నా మాటలు సరిపోవు. చదువు చెప్పే సమయంలో మీరు చూపించిన శ్రద్ధ, ప్రేమ .. మీరు చేసిన సాయాన్ని నా జన్మలో మరువలేను.. ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు

*మా తల్లిదండ్రులు జన్మనిచ్చారు. మీరు జీవితాన్ని ఇచ్చారు. జీవితంలో మంచి-చెడు, నిజాయితీ, విలువలు .. ఇలా ఎన్నో నేర్పించి.. అందమైన భవిష్యత్ ను నాకు ఇచ్చిన మీకు కృతఙ్ఞతలు..  హ్యాపీ టీచర్స్ డే సర్ 

*నేను జీవిస్తున్నందుకు మా నాన్నకు రుణపడి ఉంటాను. కానీ ఇంతబాగా జీవిస్తున్నందుకు మా గురువుకు రుణపడి ఉన్నాను.- అలెగ్జాండర్

*బాల్యంలో నేను చేసిన అల్లరిని భరిస్తూ.. నా తప్పులను తెలియజేస్తూ.. నాకు అందమైన జీవితం ఏర్పడే విధంగా బాటలు వేసిన గురువు మీరు.. మీరు చేసిన దానికి నేను చెప్పే థాంక్స్ చాలా చిన్నది.. హ్యాపీ టీచర్స్ డే   

*అవినీతి లేని సమాజం కావాలనుకున్నప్పుడు ఆ దేశంలో ముగ్గురు మనుషులు సరిగ్గా ఉండాలి. అందులో అమ్మా నాన్న ఇద్దరైతే మూడవ స్థానం ఉపాధ్యాయులదే అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. ఆయన మాటను నా విషయంలో నిజం చేసిన మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

*శిల్పి తన ఉలితో రాయని చెక్కినట్లు నా జీవితాన్ని మీరు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా మీరు చేసిన సహాయానికి.. ఇచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞతలు.. హ్యాపీ టీచర్స్ డే..

*మీరు మాకు చెప్పింది పాఠాలు మాత్రమే కాదు.. జీవితంలో ఎలా నడుచుకోవాలి.. ఎలా బతకాలి అన్న విషయాలు.. వాటికి డబ్బుతో విలువ కట్టలేము.  మీరు విద్యార్థులను తీర్చిదిద్దడానికి పడిన తపన మాకు ఇప్పుడు అర్ధమవుతుంది టీచర్.  హ్యాపీ టీచర్స్ డే.. 

నిజంగా ఉపాద్యాయుడు లేకపోతే మనకు భవిష్యత్ లేదు.. నిజంగా గురువు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే కాంతులను నింపుతూ.. బంగారు భవిష్యత్ కు  బాటలు వేస్తారు. అటువంటి ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి.. వారిని గౌరవించుకోవాలి.  చదువు చెప్పే టీచర్ కు .. ఆ గురువుని గుర్తు పెట్టుకుని గౌరవించే విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

Also Read:

 ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. ఏ రాశివారు చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయంటే..

ఏపీలో కుండపోత వర్షాలు, ఊహించని రీతిన ప్రమాదాలు

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!