Petrol Rates: వాహనదారులకు రిలీఫ్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు. హైదరాబాద్‌లో ఎంత తగ్గిందో తెలుసా?
Petrol Rates: మొన్నటి వరకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. ఒకానొక సమయంలో లీటర్ పెట్రోల్ రూ. 150కి చేరుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే...
Petrol Rates: మొన్నటి వరకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. ఒకానొక సమయంలో లీటర్ పెట్రోల్ రూ. 150కి చేరుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడడంతో పాటు స్వల్పంగా తగ్గుదల కూడా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతుండడం ఉపశమనం కలిగిస్తోంది. అయితే ఈ తగ్గుదల భారీగా లేకపోయినప్పటికీ.. ధరల పెరుగుదులకు చెక్‌పడడంతో వాహనదారులు కొంతలో కొంత సంతోషంగా ఉన్నారు.
తాజాగా ఆదివారం కూడా పెట్రోల్ డీజిల్ ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూసేయండి..
* దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.62 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.26 కాగా, డీజిల్ రూ. 96.19 గా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.12 గా ఉండగా, డీజిల్ ధర రూ. 93.40 గా నమోదైంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.70 కాగా, డీజిల్ రూ. 94.04 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26 గా ఉండగా, డీజిల్ రూ.96.69 గా ఉంది. * ఆదిలాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.50 కాగా, డీజిల్ రూ. 98.77 వద్ద కొనసాగుతోంది. * విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 107.41గా ఉండగా, డీజిల్ రూ. 98.32 గా ఉంది. * సాగర నగరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.22 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 98.32గా ఉంది.