Pooja Hegde: సినిమాల్లో రాణించాలంటే అది తప్ప నాకు మరో మార్గం లేదనిపించింది.. పూజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.

Pooja Hegde: 'ఒకలైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. అనతిల కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుందీ చిన్నది...

Pooja Hegde: సినిమాల్లో రాణించాలంటే అది తప్ప నాకు మరో మార్గం లేదనిపించింది.. పూజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 05, 2021 | 8:10 AM

Pooja Hegde: ‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. అనతిల కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుందీ చిన్నది. నటించిన తక్కువ సినిమాలే అయినా ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకున్న పూజా.. టాలీవుడ్‌లో దాదాపు అందరు టాప్‌ యంగ్‌ హీరోల సరసన ఆడిపాడింది. అందం, అభినయంతో కుర్రకారు మతులు పోగొడుతోన్న ఈ చిన్నది నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘మోస్ట్‌ బ్యాచిలర్’, ‘రాధే శ్యామ్’, ‘బీట్స్‌’ వంటి మోస్ట్‌ వెయిటింగ్‌ సినిమాల్లో నటిస్తోన్న ఈ చిన్నది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా పూజా మాట్లాడుతూ.. ‘ఇప్పుడైతే నేను ఇంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నా కానీ చదువుకునే రోజుల్లో చాలా రిజ్వర్డ్‌గా ఉండేదాన్ని. చాలా మానసిక భయాలు ఉండేవి.. కానీ కెమెరా ముందుకొచ్చిన తర్వాత వాటిపై విజయం సాధించాను. చదువుకునే రోజుల్లో ఎక్కాలంటే చాలా భయమేసేది. డ్యాన్స్‌ పర్‌ఫార్మ్‌ చేస్తున్న సమయంలో భయం వల్ల ఒక్కోసారి స్టెప్స్‌ కూడా మర్చిపోయేదాన్ని. అయితే సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కెమెరా ముందుకు రాగానే భయమేసేది.. కానీ వృత్తిలో రాణించాలంటే భయాల్ని జయించడం తప్ప మరో మార్గం లేదనిపించింది. అంతేకాకుండా సినిమాలపై ఉన్న ప్రేమ నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలుగుతున్నా’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: chandini chowdary: కుర్రకారు మతులు పోగొడుతోన్న అందాల చాందిని.. నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటో షూట్‌.

Nithiin: వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్న నితిన్.. నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తున్నాడో తెలుసా..

Liger Movie: తిరిగి పట్టాలెక్కిన పూరి సినిమా.. లైగర్ షూటింగ్ కోసం గోవా వెళ్లనున్న చిత్రయూనిట్..