AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Movie: తిరిగి పట్టాలెక్కిన పూరి సినిమా.. లైగర్ షూటింగ్ కోసం గోవా వెళ్లనున్న చిత్రయూనిట్..

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం అయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ నుంచి సినిమా రాలేదు.

Liger Movie: తిరిగి పట్టాలెక్కిన పూరి సినిమా.. లైగర్ షూటింగ్ కోసం గోవా వెళ్లనున్న చిత్రయూనిట్..
Liger
Rajeev Rayala
| Edited By: Team Veegam|

Updated on: Sep 06, 2021 | 12:36 PM

Share

Liger Movie: క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం అయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ నుంచి సినిమా రాలేదు. ప్రస్తుతం విజయ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్‌‌‌కు.. అనన్య టాలీవుడ్‌కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. పూరి, ఛార్మీ, కరణ్ జోహర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం కావడంతో కథానుగుణంగా ఈ సినిమాలోని కొన్ని సీన్లను ఫారెన్‌లో తెరకెక్కించాల్సి ఉందట. కాని కరోనా కారణంగా అది కుదరలేదని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను కరోనా తర్వాత ఇటీవలే తిరిగి ప్రారంభించాడు పూరి. అన్ని కుదిరితే వినాయక చవితికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా ఎంటర్ అయ్యి మొత్తం మార్చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌‌‌ను శరవేగంగా చేయాలని ప్లాన్ వేస్తున్నాడు పూరి. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగును ‘గోవా’లో ప్లాన్ చేశారు. వచ్చేవారం ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది. ఈ నెలంతా కూడా విజయ్ దేవరకొండపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఆ తరువాత షెడ్యూల్‌ను విదేశాల్లో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. విదేశీ ఫైటర్లతో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌కు తల్లిగా ఆమె నటిస్తున్నారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

చీరలో పడుచు సోయగం.. ఆకట్టుకుంటున్న అనసూయ న్యూ ఫొటోస్..: Anasuya Bharadwaj Photos.

Nabha Natesh: బంపర్ ఆఫర్ అందుకున్న ఇస్మార్ట్ బ్యూటీ.. సూపర్ స్టార్ సరసన నభా నటేశ్ ?

Sunitha Upadrashta: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత