Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: హీరోగా బండ్ల గణేష్.. పట్టాలెక్కిన సినిమా… ఆకట్టుకుంటున్న లుక్..

బండ్ల గణేష్.. కమెడియన్‏గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్ట్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. ఇక తర్వాత క్రమంగా

Bandla Ganesh: హీరోగా బండ్ల గణేష్.. పట్టాలెక్కిన సినిమా... ఆకట్టుకుంటున్న లుక్..
Bandla Ganesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2021 | 8:14 AM

బండ్ల గణేష్.. కమెడియన్‏గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్ట్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. ఇక తర్వాత క్రమంగా నిర్మాతగా చిన్న చిన్న సినిమాలను నిర్మించారు. బండ్లగణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. దబాంగ్ రీమేక్‏గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. దీంతో ఒక్కసారిగా బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్‏గా ఎదిగిపోయారు. ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అటు రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు సహయనటుడి పాత్రలో కనిపించిన బండ్ల గణేష్… ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు.

బండ్ల గణేష్ హీరోగా మొదటి సారి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తమిళ హిట్ ఒత్తు సెరుప్పు సైజ్ 7 సినిమా తెలుగు రీమేక్ ‏లో హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ స్టిల్‏ని ట్వీట్ చేశారు. తను తెలుగులో చేస్తున్న పాత్రలను హిందీలో అభిషేక్ బచ్చన్ పోషిస్తున్నారు. ఈ సినిమాను రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం బండ్ల గణేష్ మేక్ ఓవర్ అయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ట్వీట్..

Also Read: Pooja Hegde: సినిమాల్లో రాణించాలంటే అది తప్ప నాకు మరో మార్గం లేదనిపించింది.. పూజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.

chandini chowdary: కుర్రకారు మతులు పోగొడుతోన్న అందాల చాందిని.. నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటో షూట్‌.