Sonu Sood: ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన సోనూసూద్.. కట్ చేస్తే.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..

సోనూసూద్.. ఒకప్పుడు సాధారణ నటుడు.. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలలోనే కనిపించేవాడు. కానీ ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా

Sonu Sood: ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన సోనూసూద్.. కట్ చేస్తే.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..
Sonu Sood
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2021 | 8:51 AM

సోనూసూద్.. ఒకప్పుడు సాధారణ నటుడు.. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలలోనే కనిపించేవాడు. కానీ ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎంతో మంది ఆయనను దైవంగా కొలుస్తున్నారు. రియల్ హీరో అంటూ తమ అభిమాన స్టార్‏ను పొగుడుతుంటారు. ఇందుకు కారణం.. లాక్‏డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలే. అడిగిన వారికి లేదనకుండా సాయం అందిస్తూ… రియల్ హీరో అనిపించుకున్నారు. వలస కార్మికుల పాలిట అపద్భాందవుడిగా మారాడు. దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ సోనూకు అభిమానులు ఉన్నారు. రియల్ హీరోను కలిసేందుకు వీరాభిమానులు సాహసాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక మరికొంత మంది.. తమ పిల్లలకు.. వ్యాపార సంస్థలకు సోనూ సూద్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతటి అభిమానులను సొంతం చేసుకున్న సోనూసూద్‏కు బాగుండాలి అనుకుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు ప్రమాదకరమైన స్టంట్స్ చేయవద్దని కొరుకుంటున్నారు. ఇంతకీ సోనూ ఏం చేసాడో తెలుసుకుందామా.

రియల్ హీరో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు సహాయ కార్యకలపాలు చేస్తూనే… మరో వైపు తన ఆరోగ్యం… ఫిట్నెస్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాడు. తాజాగా ఆయన చేసిన ఫిట్నెస్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుల సోనూ తన రెండు చేతులు నేలపై పెట్ట కాళ్లు గాల్లోకి లేపాడు. అలా కాసేపటి తర్వాత తన చేతులను కూడా తీసివేయడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇదంతా వీడియో ట్రిక్.. నేలపై ఉండి.. అలా వినూత్నంగా వీడియో తీసాడు సోనూసూద్. ఇక ఇలా ప్రమాదకరమైన స్టంట్స్ చేయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ట్వీట్..

Also Read: Bandla Ganesh: హీరోగా బండ్ల గణేష్.. పట్టాలెక్కిన సినిమా… ఆకట్టుకుంటున్న లుక్..

Pooja Hegde: సినిమాల్లో రాణించాలంటే అది తప్ప నాకు మరో మార్గం లేదనిపించింది.. పూజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.