Astrology : గోర్లపై ఉండే రంగు, ఆకారం మీ భవిష్యత్‌ను చెప్పగలవు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..

Astrology : ఏ మనిషికైనా కాళ్లు, చేతులు గోర్లు వస్తాయి. గోర్లు కొంత పెరగగానే వెంటనే వాటిని మనం కట్ చేస్తుంటాం. అయినప్పటికీ అవి పెరుగుతూనే ఉంటాయి. ఇవి జీవితకాలం..

Astrology : గోర్లపై ఉండే రంగు, ఆకారం మీ భవిష్యత్‌ను చెప్పగలవు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..
Astro
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 05, 2021 | 6:47 AM

Astrology : ఏ మనిషికైనా కాళ్లు, చేతులు గోర్లు వస్తాయి. గోర్లు కొంత పెరగగానే వెంటనే వాటిని మనం కట్ చేస్తుంటాం. అయినప్పటికీ అవి పెరుగుతూనే ఉంటాయి. ఇవి జీవితకాలం ఇలా ఉంటాయి. అయితే, మన చేతికి ఉండే గోర్లు మన వేలి చిగుర్లను కాపాడటమే కాకుండా.. మన భవిష్యత్ సంకేతాలను కూడా ఇస్తాయనే విషయం ఎంత మందికి తెలుసు? ఈ గోర్లు ఉండే విధానాలను బట్టి మన గ్రహ గతులు తెలియజేయొచ్చని ఎంతమందికి తెలుసు? అవును.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ గోళ్ల ఆకారం, ఆకృతి, రంగు ద్వారా మీ ఆరోగ్యాన్ని అంచనా వేయడమే కాకుండా మీ లక్షణాలు, స్వభావం, భవిష్యత్‌ను కూడా గుర్తించవచ్చు. మీ చేతి వేళ్ల గోర్లు ఏం చెబుతున్నాయి..? మీ చేతి వేళ్ల గోర్ల రంగు, తీరును బట్టి మీ భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

గోళ్లపై మచ్చలు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వేళ్లపై నల్ల మచ్చలు భవిష్యత్తులో మీరు పొందే వైఫల్యాన్ని లేదా ఏదైనా నష్టాన్ని సూచిస్తాయి. అదే సమయంలో, ఆరోగ్య కోణంలోనూ ఇది దుష్ప్రభావాన్ని సూచిస్తుంది. మీ గోళ్లపై నల్లని మచ్చలు ఉంటే అది మీ రక్త సంబంధిత వ్యాధికి సూచిక. మీరు డాక్టర్‌ని కలిసి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

తెలుపు రంగులో గోళ్లు.. వేలి గోర్లు తెల్లని రంగులో ఉన్న వ్యక్తులు.. కష్టపడే తత్వం కలిగిన వారు. వీరు ఎతో చాకచక్యంగా, అనుకున్నవి సాధించే క్రమంలో దృఢంగా ఉంటారు. వీరు ఏ పనిలోనూ ఆలస్యం చేయడం ఇష్టపడరు. సాధారణంగా వారు త్వరగా ప్రతిదీ చేయాలని ఇష్టపడతారు.

పింక్ కలర్‌లో గోళ్లు.. గోర్లు గులాబీ రంగులో ఉన్న వ్యక్తులు.. ఆరోగ్యంగా, సంతోషంగా ఉదారంగా ఉంటారు. వీరి ఆలోచనలు ప్రగతిశీలమైనవి.

నల్లబడిన గోళ్లు.. గోళ్లు కొద్దిగా నల్లగా ఉన్న వ్యక్తులు తరచుగా ఏదో ఒక వ్యాధి బారిన పడుతుంటారు. వీరు చిరాకు స్వభావంతో బాధపడుతూ ఉంటారు.

చిన్న గోళ్లు.. వేళ్ల గోర్లు చిన్నగా ఉన్న వారు ఎవరైనా సరే కాస్త మొరటుగా ఉంటారు. అలాంటి వ్యక్తులు సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటారు.

చదురస్త్రాకార గోళ్లు.. వేళ్లపై చతురస్రాకార గోర్లు ఉన్న వ్యక్తులు చిన్న విషయానికి కూడా తరచుగా భయపడతారు. అలాంటి వ్యక్తులు తరచుగా గుండె జబ్బులకు గురవుతారు.

Also read:

Suicide: ఊరెళ్లే విషయంలో దంపతుల మధ్య వివాదం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పెళ్లైన పది నెలలకే.

Numerology: మీ జీవిత భాగస్వామి స్వభావం, లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇది చూడండి..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే