Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: గులాబీ పువ్వులతో వాస్తు నివారణ.. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ హాంఫట్..!

అడవికి రాజు సింహం అన్నట్లుగానే.. పువ్వులకు రాజు గులాబీని పిలుస్తారు. గులాబీ పువ్వు ప్రేమకు చిహ్నం. అంతేకాదు.. గులాబీ పువ్వులను వివాహ వేడుకలకు, దేవతామూర్తుల పూజలకు, అనేక శుభకార్యాలకు, ఇతర పనులకు కూడా ఉపయోగిస్తారు.

Astrology: గులాబీ పువ్వులతో వాస్తు నివారణ..  మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ హాంఫట్..!
Rose Flowers
Follow us
Shiva Prajapati

| Edited By: Jyothi Gadda

Updated on: Mar 16, 2023 | 5:43 PM

అడవికి రాజు సింహం అన్నట్లుగానే.. పువ్వులకు రాజు గులాబీని పిలుస్తారు. గులాబీ పువ్వు ప్రేమకు చిహ్నం. అంతేకాదు.. గులాబీ పువ్వులను వివాహ వేడుకలకు, దేవతామూర్తుల పూజలకు, అనేక శుభకార్యాలకు, ఇతర పనులకు కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు.. ఆరోగ్య సంబంధిత అంశాలకు కూడా గులాబీ పువ్వులను వినియోగిస్తారు. ఇక గులాబీ పువ్వులను జ్యోతిష్య శాస్త్రంలో వాస్త నివారణకు కూడా వినియోగిస్తారు. ఈ చర్యల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది.. ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. గులాబీ పువ్వునకు సంబంధించి ఆస్ట్రో రెమెడీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అప్పుల నుంచి విముక్తి..

అప్పుల బాధ నుంచి విముక్తి కలగాలంటే.. 5 ఎర్ర గులాబీలను తెల్లటి రంగు వస్త్రానికి నాలుగు మూలలకు కట్టి, మధ్యలో మరో పువ్వును కట్టి, పువ్వుతో పాటు వస్త్రాన్ని నదిలో వేయాలి. ఇలా చేయడం ద్వారా అప్పుల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది.

వ్యాధుల నివారణకు..

కుటుంబ సభ్యులు దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నట్లయితే, ఒక పగలని తమలపాకు, గులాబీ పువ్వు, బటాషే తీసుకొని రోగిపై నుంచి 11 సార్లు తిప్పి.. ఆపై నాలుగు రోడ్ల కూడలిలో విసిరేయాలి. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉద్యోగం కోసం..

ఉద్యోగం కోసం హనుమాన్ టెంపుల్‌కి వెళ్లి 40 రోజుల పాటు ఉదయం ఎర్ర గులాబీ పువ్వును సమర్పించాలి. దీంతో, మీరు కోరుకున్న ఉద్యోగం త్వరలో పొందుతారు.

ఆనందం, శ్రేయస్సు కోసం..

ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం.. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులను సమర్పించాలి. ఇలా వరుసగా 11 శుక్రవారాలు చేయడం వల్ల లక్ష్మి దేవి సంతోషించి ఇంట్లో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది.

ఆర్థిక సమస్యలు..

ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడటానికి ఇంట్లో అంతా శుభం జరగడానికి ఎర్రచందనం, ఎర్ర గులాబీ, రోలీలను ఎర్రటి వస్త్రంలో కట్టి, మంగళవారం నాడు హనుమంతుని ఆలయంలో ఒక వారం పాటు ఉంచాలి. ఆ తరువాత తిరిగి ఇంటికి తీసుకురావాలి. ఇంట్లో దుకాణం లేదా, బీరువాలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి, ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది.

డబ్బు కోసం..

శుక్రవారం సాయంత్రం వేళ గులాబీ పువ్వుపై కర్పూరం వెలిగిస్తే ఐశ్యర్యం కలుగుతుంది. ఇంట్లోకి ధన లక్ష్మీ వస్తుంది. ధన లాభం కలుగుతుంది.

గమనిక: పైన ఇవ్వబడిన సమాచారం కేవలం ఊహగానాలు, మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..