Tirumala Temple: నేడు తిరుమలకు సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
Tirumala Salakatla Brahmotsavam 2021: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ తిరుమల శ్రీవారిని
Tirumala Salakatla Brahmotsavam 2021: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రభుత్వం తరఫున తిరుమలేశుడికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో సీఎం జగన్ తిరుమల షెడ్యూల్‌ని పేర్కొన్నారు.
ఈ షెడ్యూల్ ప్రకారం.. ముఖ్యమంత్రి జగన్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సరిగ్గా 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బర్డ్ హాస్పటిల్‌కు వెళతారు. అక్కడ నిర్మించిన చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్స ఆస్పత్రిని సీఎం ప్రారంభిస్తారు. ఆ తరువాత అలిపిరి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నిర్మించిన నడకదారి, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని అక్కడ స్వామివారి దర్శనం చేసుకోనున్నారు సీఎం జగన్. అక్కడి నుంచి నడకదారిలో శ్రీవారి ఆలయానికి చేరుకుని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలేశుడి దర్శనం అనంతరం సీఎం జగన్ ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తరువాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని.. ఇవాళ రాత్రి అక్కడే బస చేస్తారు.
ఇక 12వ తేదీన ఉదయం 5.30 గంటలకు మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుంటారు ముఖ్యమంత్రి జగన్. స్వామి వారి దర్శనం అనంతరం గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కన్నడ, హిందీ చానళ్ళను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్ధ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత పద్మావతి అతిధి గృహానికి చేరుకుని.. అటునుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనం అవుతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
Also read:
VIP Tree: వీఐపీ చెట్టు.. 24 గంటలూ రక్షణగా సెక్యూరిటీ గార్డులు.. నిర్వహణ కోసం లక్షల ఖర్చు..
Hair Growing: జుట్టు సమస్యలతో సతమతవుతున్నారా?.. అయితే, ఈ 7 ఆహార పదర్థాలను తప్పక తినాల్సిందే..