Viral News: 51 సంవత్సరాల క్రితం పోయిన పర్స్.. తీవ్రంగా శ్రమించి వెతికి పెట్టిన పోలీసులు.. ఓపెన్ చూస్తే షాక్..

Viral News: పోలీసులంటే అవినీతి, డబ్బులు ముట్టజెప్పనిదే న్యాయం జరుగదు అనే భావన అందరిలోనూ ఉంటుంది. కానీ అందరు పోలీసులు అలా ఉండరనేది వాస్తవం.

Viral News: 51 సంవత్సరాల క్రితం పోయిన పర్స్.. తీవ్రంగా శ్రమించి వెతికి పెట్టిన పోలీసులు.. ఓపెన్ చూస్తే షాక్..
Purse
Follow us

|

Updated on: Oct 11, 2021 | 12:05 PM

Viral News: పోలీసులంటే అవినీతి, డబ్బులు ముట్టజెప్పనిదే న్యాయం జరుగదు అనే భావన అందరిలోనూ ఉంటుంది. కానీ అందరు పోలీసులు అలా ఉండరనేది వాస్తవం. వంద శాతం నిజాయితీ కలిగిన పోలీసులు కూడా ఉంటారు. వారివల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు గౌరవం, మర్యాద లభిస్తున్నాయడంలో అతిశయోక్తి లేదు. అయితే, ఇప్పుడు మనం అమెరికాలోని కాన్సాస్ పోలీసుల నిజాయితీ గురించి చర్చించుకోవాలి. వారి నిజాయితీ లెవల్స్ పీక్స్ అని చెప్పాల్సిందే. తాజాగా కాన్సాస్ పోలీసులు51 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్స్‌ని కనుగొన్నారు. అంతేకాదు.. పర్స్ పోగొట్టుకున్న వ్యక్తి చిరునామాను కనిపెట్టి మరీ.. అతనికి ఆ పర్స్‌ని అందజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. మరి వార్త ఏంటి? ఆ పర్స్ కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

కాన్సాస్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం.. 1970 సంవత్సంరలో ఓ వ్యక్తి తన పర్స్ పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. కానీ, పోలీసులు ఆ పర్స్‌ను కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, తాజాగా గ్రేట్ బెండ్ పోలీస్ అధికారులకు ఈ పర్స్ లభించింది. ఓ వ్యక్తికి పర్స్ దొరకగా.. దానికి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు దానిని చూడగా.. సామాజిక భద్రతా కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి ఇతర కార్డులు ఉన్నాయి. వాటి ఆధారంగా.. ఈ వాలెట్ యజమాని ఎవరనేది కనిపెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు. అయితే, వాలెట్ యజమాని అడ్రస్ మారాడు. అయినప్పటికీ పోలీసులు.. అతని చిరునామాను కొనుగోన్నారు. కాన్సాస్‌లోని లారెన్స్‌లో నివాసం ఉంటున్నాడని గుర్తించి.. పర్స్‌ను తీసుకెళ్లి అతనికి అప్పగించారు.

ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ పర్స్ గురించి అతను ఎప్పుడో మర్చిపోయాడు. తన పర్స్ ఎప్పుడు చోరీకి గురైందో కూడా అతనికి గుర్తు లేదు. అయితే, పర్స్ ఓపెన్ చేయగా తనకు సంబంధించిన కార్డులు, ఇతర వివరాలు ఉండగా.. అప్పుడు పర్స్ పోయిన విషయం గుర్తుకు వచ్చింది. పోలీసులు ఆ పర్స్‌ను తనకు తిరిగి ఇవ్వడాన్ని చూసి.. సదరు వ్యక్తి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. వాస్తవానికి ఈ పర్స్‌ను అతనే స్వయంగా తయారు చేశాడని, పోయిన పర్స్ ఇప్పుడు దొరకడంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అరుదైన ఘటన కావడంతో దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, పోలీసుల నిజాయితీకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వాస్తవానికి ప్రస్తుత రోజుల్లో ఎవరికైనా పాత వాలెట్ దొరికితే దాన్ని లక్ష్యపెట్టరు. అలాంటిది.. ఆ పర్స్ యజమాని అడ్రస్‌ని కనిపెట్టి.. అతనికి చేరవేయడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also read:

Hair Growing: జుట్టు సమస్యలతో సతమతవుతున్నారా?.. అయితే, ఈ 7 ఆహార పదర్థాలను తప్పక తినాల్సిందే..

E-commerce: నాలుగు రోజులు.. 2.7 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ అమ్మకాలు..

Space News: ఆ బ్లాక్‌ నైట్‌ శాటిలైట్‌ ఏలియన్స్‌దేనా?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నాసా!