Amarnath Yatra 2022: అమర్‌నాథ్‌ యాత్రకు మళ్లీ బ్రేక్‌.. తిరిగే అప్పుడే భక్తులకు అనుమతి..!

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రతిరోజూ వేలాది మంది పవిత్ర గుహను సందర్శిస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్‌నాథ్ యాత్రను

Amarnath Yatra 2022: అమర్‌నాథ్‌ యాత్రకు మళ్లీ బ్రేక్‌.. తిరిగే అప్పుడే భక్తులకు అనుమతి..!
Amarnath Yatra
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 05, 2022 | 12:07 PM

Amarnath Yatra: చార్‌ధామ్‌ యాత్ర అనంతరం జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రతిరోజూ వేలాది మంది పవిత్ర గుహను సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సీఆర్పీఎఫ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్‌నాథ్ యాత్రను మంగళవారం తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం అనుకూలించిన వెంటనే మళ్లీ ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం పహల్గామ్ యాక్సిస్‌లోని నున్వాన్ బేస్ క్యాంపు వద్ద సుమారు 3,000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. రానున్న 36 గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కాగా, జూన్ 30న మొదలైన ఈ యాత్రను ఇప్పటివరకు 75,000 మంది యాత్రికులు సందర్శించుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 11న ఈ యాత్ర ముగియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి