Balkampet Yellamma Kalyanam 2022: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం..
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు కల్యాణ క్రతువు జరుగనుండగా.. బుధవారం అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు.

Balkampet Yellamma
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం జులై 5 ఘనంగా ప్రారంభించారు.. మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు కల్యాణ క్రతువు జరుగనుండగా.. బుధవారం అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
