Akshaya Tritiya: ఈ వస్తువులు దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం.. డబ్బుకి లోటు ఉండదు..
అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే జీవితంలో చాలా పురోగతి ఏర్పడుతుందని విశ్వాసం. అయితే బంగారం కొనడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో అనేక ఇతర చర్యలు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి.

హిందూ మతంలో అక్షయ తృతీయ పర్వదినం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆ రోజున లక్ష్మీదేవి, విష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అంతేకాదు సుఖ సంపదలు నెలకొంటాయని నమ్మకం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే సంప్రదాయం కూడా అనుసరిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే జీవితంలో చాలా పురోగతి ఏర్పడుతుందని విశ్వాసం.
అయితే బంగారం కొనడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో అనేక ఇతర చర్యలు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి.
- అక్షయ తృతీయ రోజున పేదవారికి దానం చేయడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు దానం చేయాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
- అక్షయ తృతీయ రోజున కుంకుమ దానం చేయడం చాలా శుభప్రదమని నమ్ముతారు. వైవాహిక జీవితం గడుపుతున్న వారు ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున కుంకుమ దానం చేయాలి. ఇలా చేయడం వలన మీకు మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుందని, సంబంధాన్ని బలపరుస్తుందని నమ్ముతారు.
- అక్షయ తృతీయ రోజున ఆకలితో ఉన్న లేదా పేద వ్యక్తికి ఆహారాన్ని దానం చేయండి. ఇలా ఆకలి తీర్చడం చాలా పుణ్యమని విశ్వాసం. ఇది జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది.
- తమలపాకులకు హిందూమతంలో విశిష్ట స్థానం ఉంది. తమలపాకులను పూజకు ఉపయోగిస్తారు. అక్షయ తృతీయ రోజున తమలపాకులను దానం చేయడం వల్ల సంతోషం, అదృష్టాలు లభిస్తాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. జీవితంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి.
- కొబ్బరికాయను దానం చేయడం వల్ల మనిషికి మోక్షం లభిస్తుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున ఈ దానం చేస్తే ఎక్కువ లాభాలు. ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)