Vastu Tips : ఈ దిక్కులో మొక్కలు నాటితే దరిద్రం ఇంటికి ఆహ్వానించినట్లే..
సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకుని మనం నడుచుకున్నట్లయితే అన్నీ శుభఫలితాలే ఎదురౌతాయి
సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకుని మనం నడుచుకున్నట్లయితే అన్నీ శుభఫలితాలే ఎదురౌతాయి. ఇంట్లో మొక్కలు పెంచుకునేవారు కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం చెట్లు, మొక్కలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
అందుకే చెట్లు, మొక్కలు నాటే ముందు వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వాస్తు చెబుతోంది. అలాగే వాటిని సరైన దిశలో నాటాలి. ఎందుకంటే ఇంట్లో మొక్కలు నాటే దిశ అనేది అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోయి పచ్చదనం కూడా వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇంట్లో ఈ దిక్కులో మొక్కలు నాటకూడదని, ఆ దిశల్లో మొక్కలు నాటితే దరిద్రాన్ని ఇంటికి ఆహ్వానించినట్లేనని పండితులు చెబుతున్నారు.
నైరుతి దిశలో మొక్కలు నాటకూడదు:
మొక్కలు పచ్చదనాన్ని అందించినప్పటికీ…మొక్కలను నాటే కొన్ని దిశలు అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం పచ్చని మొక్కలు ఇంటికి నైరుతి దిశలో పెంచకూడదు. ఈ దిశలలో తగినంత సూర్యరశ్మి ఉండదు. వాస్తు దృక్కోణం నుంచి ఈ ప్రదేశం మొక్కలను అశుభకరమైనదిగా పరిగణిస్తారు.
లోహంతో చేసిన వస్తువులు తూర్పు దిక్కున ఉంచకూడదు:
మొక్కలను నైరుతి దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ పెద్ద డబ్బు కొరత, చేపట్టిన పనుల్లో వైఫల్యాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. అంతేకాదు లోహంతో చేసిన వస్తువులు ఇంటికి తూర్పు దిక్కున ఉంచకూడదు. లోహపు వస్తువులను ఈ దిశలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది.
ఇంటికి సింహద్వారానికి ఎదురుగా చెట్లు పెంచకూడదు:
ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు ఇంటి సింహద్వారానికి ఎదురుగా కానీ, కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంటుంది. అన్ని రకాల పండ్ల చెట్లను పెంచేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలేసి మిగతా దిక్కుల్లో చెట్లను పెంచుకోవాలి.
ఈశాన్య భాగంలో మొక్కలు పెంచకూడదు:
తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప వంటి మొక్కలను మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే మంచిది కాదు. ఈ దిశలో ఎన్ని మొక్కలు నాటినా అవి పెరగవు. అదే వాస్తు ప్రకారం నాటితే అవి త్వరగా నాటుకుని పెరగడం ప్రారంభిస్తాయి. వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కంపౌండ్ కు ఐదు అడుగుల దూరంలో నాటాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)