ఉత్తర తెలంగాణాలో కమలం హవా!

కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం టీఆర్‌ఏస్ కు కోలుకోలేని దెబ్బ. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్‌ కరీంనగర్‌ నియోజకవర్గంలోనే శ్రీకారంచుట్టి.. ‘‘ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు తనకు కుడిభుజంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడుతున్న వినోద్‌కుమార్‌ను దేశం అబ్బురపడేవిధంగా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించండి.. ఆయన కేంద్రంలో మంత్రి పదవిని చేపడతారు’’.. అని చేసిన విన్నపాన్ని ఆయన సెంటిమెంట్‌ జిల్లా తిరస్కరించింది. వినోద్‌కుమార్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి […]

ఉత్తర తెలంగాణాలో కమలం హవా!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 24, 2019 | 3:31 PM

కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం టీఆర్‌ఏస్ కు కోలుకోలేని దెబ్బ. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్‌ కరీంనగర్‌ నియోజకవర్గంలోనే శ్రీకారంచుట్టి.. ‘‘ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు తనకు కుడిభుజంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడుతున్న వినోద్‌కుమార్‌ను దేశం అబ్బురపడేవిధంగా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించండి.. ఆయన కేంద్రంలో మంత్రి పదవిని చేపడతారు’’.. అని చేసిన విన్నపాన్ని ఆయన సెంటిమెంట్‌ జిల్లా తిరస్కరించింది.

వినోద్‌కుమార్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ను 89,508 మెజారిటీతో గెలిపించింది. నిజామాబాద్‌ ప్రజలు కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితను తిరస్కరించడం గమనార్హం. ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు విజయం సాధించారు. ఇదే ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ కు చెందిన అభ్యర్థి బి.వెంకటేశ్‌నేత గెలుపొందడం ఆ పార్టీకి కొంత ఊరట కలిగించే విషయమే అయినా.. బీజేపీ ఆఖరి నిమిషం వరకు అక్కడ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఆ పార్టీకి కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

21 మంది ఎమ్మెల్యేలున్నా.. తమ ఎంపీలను గెలిపించుకోలేని పరిస్థితి ఈ నియోజకవర్గాల్లో ఏర్పడటం గమనార్హం. ఇందుకు.. టీఆర్‌ఎస్‌ పార్టీపై వీస్తున్న వ్యతిరేక పవనాలు ఒక కారణమైతే.. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడడం, ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ కనిపించడంతో ఓటర్ల ఆలోచనాసరళి మారిందని తెలుస్తోంది. అనూహ్య విజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీజేపీ.. ఈ విజయాలతో ఉత్తర తెలంగాణలో పాగా వేయాలనే ఆలోచనకు వస్తున్నది.