AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక రాహుల్ రాజీనామా చేయక తప్పదా ?

జాతీయ ఎన్నికల్లో రెండో సారీ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేస్తారా ? ఓటమికి దారి తీసిన కారణాలపై పార్టీ అత్యున్నత కమిటీ,,కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-సి డబ్ల్యూ సి శనివారం సమావేశమవుతోంది. రాహుల్ రాజీనామా చేయవచ్ఛుననే అంశమే ఈ సమావేశంలో ప్రధాన అజెండా కానుందని అంటున్నారు. యూపీ లోని అమేథీలో రాహుల్ ఓటమి ఆ పార్టీకి శరాఘాతంలా తగిలింది. ప్రతిపక్ష నేత హోదా అర్హత పొందేందుకు […]

ఇక రాహుల్ రాజీనామా చేయక తప్పదా  ?
Pardhasaradhi Peri
|

Updated on: May 24, 2019 | 2:50 PM

Share

జాతీయ ఎన్నికల్లో రెండో సారీ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేస్తారా ? ఓటమికి దారి తీసిన కారణాలపై పార్టీ అత్యున్నత కమిటీ,,కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-సి డబ్ల్యూ సి శనివారం సమావేశమవుతోంది. రాహుల్ రాజీనామా చేయవచ్ఛుననే అంశమే ఈ సమావేశంలో ప్రధాన అజెండా కానుందని అంటున్నారు. యూపీ లోని అమేథీలో రాహుల్ ఓటమి ఆ పార్టీకి శరాఘాతంలా తగిలింది. ప్రతిపక్ష నేత హోదా అర్హత పొందేందుకు కాంగ్రెస్ కనీసం మూడు డిజిట్లను కూడా సాధించలేకపోయింది. అంటే రాహుల్ ఈ హోదాకు అర్హత అయినా పొందుతారా అన్నది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ పది పాయింట్లు.. అతి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం ఉదయం పదకొండు గంటల సమయంలో భేటీ అవుతోంది.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ భేటీకి హాజరు కానున్నారు. ఇక యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ యూపీలో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.. ఆయన తన రాజీనామా లేఖను రాహుల్ కు అందజేయనున్నారు. అలాగే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్.కె. పాటిల్, ఒడిశా పార్టీ చీఫ్ నిరంజన్ పట్నాయక్ కూడా రాజీనామాలు చేశారు.. తన కుటుంబానికి ఆదినుంచీ బలమైన నియోజకవర్గంగా ఉన్న అమేథీలో రాహుల్ ఓటమి రేపటి సమావేశాల్లో ప్రధాన అజెండా అని వార్తలు వస్తున్నాయి. ఓటమికి తానే బాధ్యత వహిస్తానని చెప్పిన రాహుల్.. మీరు రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా అది తనకు, పార్టీ వర్కింగ్ కమిటీకి మధ్య ఉన్న వ్యవహారమని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం నాటి ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ తమ రాజీనామాలకు సంసిధ్దత ప్రకటించారు. అప్పుడూ కేవలం నలభై నాలుగు స్థానాలతో పార్టీ ఘోర ఓటమి చవి చూసింది. నెహ్రు-గాంధీ కుటుంబానికి అంకిత భావంతో ఉన్న నేతలు ఆ ఆఫర్ ను తిరస్కరించారు. అయితే ఈ సారి నాయకత్వ మార్పిడిపై గట్టిగా ఒత్తిడి రావచ్చు. తాము దేనినైనా మారుస్తామని ‘ వాళ్ళు ‘ అనుకుంటే నాయకత్వాన్నే మార్చవచ్ఛునని రాజస్థాన్ కు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఘోర ఓటమి పార్టీ భవితవ్యం పైనా, నెహ్రు-గాంధీ కుటుంబ పాత్రపైనా ఎన్నో సందేహాలను లేవనెత్తుతోంది. అయిదేళ్ల అనంతరం కూడా బీజేపీ చేతిలో పార్టీ మళ్ళీ ఓటమి పాలు కావడం సీనియర్లకు పాలుపోవడంలేదు. ఇక పుల్వామా ఘటన, బాలాకోట్ వైమానిక దాడులు వంటి విషయాల్లో దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ దీటుగా ఎదుర్కోలేకపోయింది. ఇన్ని అంశాల నేపథ్యంలో శనివారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ హాట్ హాట్ గా సాగవచ్చు. నెహ్రు-గాంధీ కుటుంబ ముద్ర ఇక డ్యామేజీ అవుతుందా అన్న సందేహాలను విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.