భట్టి విక్రమార్కకు వడదెబ్బ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి తీవ్ర జ్వరంతో ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా గత మూడు రోజులుగా భట్టి జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ఖండిస్తూ.. ఆయా నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వడదెబ్బ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:33 am, Thu, 2 May 19
భట్టి విక్రమార్కకు వడదెబ్బ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి తీవ్ర జ్వరంతో ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా గత మూడు రోజులుగా భట్టి జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ఖండిస్తూ.. ఆయా నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వడదెబ్బ తగిలిందని వైద్యులు తెలిపారు.