అమిత్‌షాపై వ్యాఖ్యలు… రాహుల్‌కు సమన్లు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వరుస చిక్కులు వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై చేసిన వ్యాఖ్యలకు గాను స్థానిక మెట్రోపాలిటన్ కోర్టు రాహుల్‌కు బుధవారంనాడు సమన్లు పంపింది. రాహుల్ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ కార్పొరేటర్ వేసిన పరువునష్టం కేసులో కోర్టు ఈ సమన్లు జారీచేసింది. జూలై 9న కోర్టుకు హాజరుకావాల్సిందిగా రాహుల్‌ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. ‘బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ […]

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వరుస చిక్కులు వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై చేసిన వ్యాఖ్యలకు గాను స్థానిక మెట్రోపాలిటన్ కోర్టు రాహుల్‌కు బుధవారంనాడు సమన్లు పంపింది. రాహుల్ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ కార్పొరేటర్ వేసిన పరువునష్టం కేసులో కోర్టు ఈ సమన్లు జారీచేసింది. జూలై 9న కోర్టుకు హాజరుకావాల్సిందిగా రాహుల్‌ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించారు.
‘బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడు…వాహ్ క్యా షాన్ హై’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఖడియాకు చెందిన బీజేపీ కార్పొరేటర్ కృష్ణవదన్ బ్రహ్మభట్ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని, కేవలం బీజేపీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమేనని వాదించారు.



