BJP: మా చోటెక్కడ.. బీజేపీలో రెడ్డి లీడర్ల రుస రుసలు.. అసంతృప్తి గళం విప్పిన నాయకులు..
ఏపీ వ్యవహారాలపై దృష్టిసారించిన బీజేపీ హైకమాండ్ రీసెంట్ గా జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేసంలో అమిత్ షా రాష్ట్ర నేతలకు యాక్టివ్ గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో..

ఏపీ వ్యవహారాలపై దృష్టిసారించిన బీజేపీ హైకమాండ్ రీసెంట్ గా జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో అమిత్ షా రాష్ట్ర నేతలకు యాక్టివ్ గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా కోర్ కమిటీని ప్రకటించినట్లు తెలుస్తోంది. తద్వారా భవిష్యత్తులో రాజకీయ నిర్ణయాలన్నీ ఈ కమిటీ ద్వారానే తీసుకునేందుకు వీలు కల్పించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కమిటీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇవాళ ప్రకటించిన కోర్ కమిటీలో 13 మంది సభ్యులు ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాజ్యసభ ఎంపీలు జీవీఎల్, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ జి, ఎమ్మెల్సీ మాధవ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి, నిమ్మక జయరాజు ఉన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా నేషనల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ జి, ఏపీ ఇంచార్జ్ మురళీధరన్, సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ లకు చోటు కల్పించారు.అయితే ప్రకటించిన ఈ జాబితాలో ఒక్కరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చోటు ఇవ్వలేదని ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చోటు ఇవ్వాలని బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.. కోర్ కమిటీలో నాకు చోటివ్వక పోయినా పర్లేదు అని అయితే బై రెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి కి చోటు కల్పించాలని సున్నితంగా డిమాండ్ చేశాడట.
ఇప్పటికే బిజెపి లో కొన్ని సామాజిక వర్గాలికి ప్రాధాన్యం,పదవులు ఇచ్చారని కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని కాస్త పక్కన పెట్టినట్లు భావించిన నేతలు ఇదే విషయంపై మల్లగుల్లాలు పడుతూ చివరికి పార్టీ పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లారట. ఏదైనా కార్యక్రమం పార్టీ తరఫున చేయాలనుకుంటే ఈ కోర్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది.
అందులో తమ వర్గానికి కూడా స్థానం కల్పించి నట్లయితే తమ రెడ్డి సామాజిక వర్గం కూడా మరింత యాక్టివ్‌గా పనిచేస్తుందనే మెసేజ్‌ని గట్టిగానే పార్టీ పెద్ద దగ్గరకు తీసుకెళ్లారట ఆదినారాయణ రెడ్డి. మరి బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆలోచనలు చేసి రెడ్డి సామాజిక వర్గానికి కూడా జాబితాలో స్థానం కల్పిస్తుందో.. లేదో వేచి చూడాలి.
విక్రమ్, టీవీ9 రిపోర్ట్, విజయవాడ
ఇవి కూడా చదవండి: బాలీవుడ్‌లో థర్డ్ వేవ్ టెన్షన్.. కొంపముంచిన గెట్ టుగెదర్ పార్టీ.. కరణ్ జోహార్ ఇళ్లు సీజ్..




