Congress infight: మరింత రంజుగా కాంగ్రెస్ రాజకీయాలు.. పోరు తీర్చేపనిలో ఆ పార్టీ అధ్యక్షురాలు.. ఏం తేలేనో..!
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కెప్టెన్‌పై మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ యుద్దం ప్రకటించిన వేళ సోనియాతో...
పంజాబ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఢిల్లీలో చేరుకున్న CM అమరీందర్‌సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. కెప్టెన్‌పై మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ యుద్దం ప్రకటించిన వేళ సోనియాతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల వేళ అమరీందర్-సిద్దూకు మధ్య రాజీ కుదర్చడానికి సోనియా డైరెక్ట్‌గా రంగం లోకి దిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో రాహుల్-ప్రియాంకతో కొద్దిరోజుల క్రితమే సిద్దూ భేటీ అయ్యారు. ఇప్పుడు తాజాగా అమరీందర్ ఢిల్లీకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది.
పంజాబ్ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కీలక నేత నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నిత్యం పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ఎటువైపు దారి తీస్తుంది? కొంతకాలంగా జరుగుతున్న ఈ వివాదంపై హైకమాండ్ చర్యలేమిటి? సంక్షోభంలోకి వెళుతున్న కాంగ్రెస్‌లో చీలిక తప్పదా? అనే సమయంలో ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం కావడం చర్చకు కారణంగా మారింది.
పంజాబ్‌లో విద్యుత్ కోతలపై తీవ్రంగా సొంత ప్రభుత్వం పైనే మండిపడ్డారు సిద్దూ. అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన CM అమరీందర్ సింగ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. నవజ్యోత్‌సింగ్ సిద్దూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే CM అమరీందర్‌సింగ్‌తో సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అమరీందర్‌కు నచ్చచెప్పేందుకే పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది.