వామ్మో ! ఆ గుంపులను చూస్తే భయమేస్తోంది’..ఆంక్షలు పాటించని జనాల ఫోటోలను షేర్ చేసిన ICMR చీఫ్

వామ్మో ! ఆ గుంపులను చూస్తే భయమేస్తోంది'..ఆంక్షలు పాటించని జనాల ఫోటోలను షేర్ చేసిన ICMR చీఫ్
Frieghtening,income Chief On Pics Of Crowds At Hill Stations,delhi,crowds,markets,hill Stations,icmr Chief Balaram Bhargava Share Photos,balaram Bhargava ,chief On Pics Of Crowds At Hill

మనాలి, సిమ్లా, ముస్సోరి వంటి హిల్ స్టేషన్లలోనూ, ఢిల్లీ,ముంబై వంటి నగరాల మార్కెట్లలోనూ తండోపతండాలుగా ఉన్న జనాల ఫోటోలను ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ షేర్ చేశారు. ఈ జనాల గుంపులను చూస్తే భయమేస్తోందన్నారు. ఈ జనాలు కోవిద్ రూల్స్ ని, పాటించడంలేదని,

Umakanth Rao

| Edited By: Janardhan Veluru

Jul 06, 2021 | 6:57 PM

మనాలి, సిమ్లా, ముస్సోరి వంటి హిల్ స్టేషన్లలోనూ, ఢిల్లీ,ముంబై వంటి నగరాల మార్కెట్లలోనూ తండోపతండాలుగా ఉన్న జనాల ఫోటోలను ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ షేర్ చేశారు. ఈ జనాల గుంపులను చూస్తే భయమేస్తోందన్నారు. ఈ జనాలు కోవిద్ రూల్స్ ని, పాటించడంలేదని, తమ బిహేవియర్ ని మార్చుకోవడం లేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇలా ప్రొటొకాల్స్ ని ఉల్లంఘిస్తే సడలించిన ఆంక్షలను ఇక రద్దు చేయాల్సి వస్తుందన్నారు. దేశంలో కోవిద్ పూర్తిగా మటుమాయం కాలేదన్నారు. అయితే ఈ నగరాలు, హిల్ స్టేషన్లలోనే కాకుండా దేశంలో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజలు మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా మార్కెట్లలో కనిపిస్తున్నారు. కోవిద్ కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ నిబంధనలను పాటించాలని కేంద్రం పదేపదే చెబుతోంది.

కాగా హిమాచల్ ప్రదేశ్ లో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఓ నెటిజన్ సెటైరిక్ గా ట్వీట్ చేశాడు. బీజేపీ పాలిత ప్రభుత్వాలు అనుసరిస్తున్న మిస్ మేనేజ్ మెంట్ కు థాంక్స్ అని మరొకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలను ఎలా అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నించాడు.

మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.

 కరోనా కన్నా .. మాకు చేపలే ఎక్కువ?తమిళనాడు లో కోవిడ్ నిబంధలు ఉల్లంఘన వైరల్ అవుతున్న వీడియో..:Tamil Nadu Video.

 ఒట్టి చేతులతో వెనక్కి ఎందుకు.. చెప్పులు ఎత్తికెళ్తే పోలా..? దొంగతనంకు దర్జాగా లిఫ్ట్ లో వచ్చిన దొంగ..(వీడియో):Viral Video.

 ఫుట్ బాల్ పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి పెళ్లి ప్రపోజల్..!హోరెత్తిన స్టేడియం..వైరల్ అవుతున్న వీడియో..:Proposal on pitch video.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu