తల్లి ఆశీస్సులు తీసుకోనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన సొంత రాష్ట్రం గుజరాత్‌ వెళ్లనున్నారు. సాయంత్రం తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకుంటానని మోదీ ట్వీట్ చేశారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీ 4.8 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. కాగా, గతేడాది కూడా మోదీ విజయం సాధించిన తర్వాత వెళ్లి తన ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు ఓటు వేసే ముందు కూడా తన తల్లి […]

తల్లి ఆశీస్సులు తీసుకోనున్న మోదీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 25, 2019 | 4:38 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన సొంత రాష్ట్రం గుజరాత్‌ వెళ్లనున్నారు. సాయంత్రం తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకుంటానని మోదీ ట్వీట్ చేశారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీ 4.8 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. కాగా, గతేడాది కూడా మోదీ విజయం సాధించిన తర్వాత వెళ్లి తన ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు ఓటు వేసే ముందు కూడా తన తల్లి ఆశీస్సులు తీసుకుని వెళ్లారు. కాగా, సోమవారం రోజున కాశీకి వెళ్లనున్నట్లు కూడా ట్వీట్‌లో వెల్లడించారు. కాశీ ప్రజల తనపై ప్రేమాభిమానాలు చూపి గెలిపించారని.. వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లనున్నట్లు తెలిపారు.