వైసీపీ గెలవడానికి కారణం బీజేపీనే..!
ఏపీలో వైసీపీ గెలవడానికి బీజేపీ కూడా కారణమన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ రాం మాధవ్. బీజేపీ, వైసీపీ ఒకటేనంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు సైతం చాలా మంది నమ్మారని ఆయన అన్నారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం దుబారా ఖర్చులు చేశారని వాటిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన జగన్‌కు సూచించారు.