AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏ మాత్రం సరిపోను.. నాన్నమ్మతో పోల్చకండి: ప్రియాంక గాంధీ

‘‘నాన్నమ్మ ఇందిరా గాంధీతో నన్ను పోల్చకండి’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. కార్యకర్తలు తనను మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చడంపై ప్రియాంక స్పందించారు. ‘‘మా నాన్నమ్మతో నన్ను పోల్చడం తగదు. ప్రజలకు సేవ చేయడంలో తప్ప మిగిలిన ఏ విషయంలోనూ.. ఆమెతో నేను పోటీ పడలేను. ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే కోరిక నానమ్మ మనసులో చాలా బలంగా ఉండేది. అదే లక్షణం నాకు, నా సోదరునికి అబ్బింది. దాన్ని […]

ఏ మాత్రం సరిపోను.. నాన్నమ్మతో పోల్చకండి: ప్రియాంక గాంధీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2019 | 9:58 AM

Share

‘‘నాన్నమ్మ ఇందిరా గాంధీతో నన్ను పోల్చకండి’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. కార్యకర్తలు తనను మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చడంపై ప్రియాంక స్పందించారు. ‘‘మా నాన్నమ్మతో నన్ను పోల్చడం తగదు. ప్రజలకు సేవ చేయడంలో తప్ప మిగిలిన ఏ విషయంలోనూ.. ఆమెతో నేను పోటీ పడలేను. ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే కోరిక నానమ్మ మనసులో చాలా బలంగా ఉండేది. అదే లక్షణం నాకు, నా సోదరునికి అబ్బింది. దాన్ని మాత్రం మా నుంచి ఎవరూ వేరు చేయలేరు. అందుకు మీరు అనుమతించినా.. ఇవ్వకపోయినా ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని ప్రియాంక తెలిపారు.

అనంతరం బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని ఆమె మండిపడ్డారు. బీజేపీ తీరు పట్ల దేశంలో అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ విధానం వల్ల నిజంగా మేలు జరిగిందా..? అంటూ ప్రియాంక ప్రశ్నించారు. ఇక కాన్పూర్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.

Follow Us