AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: రూ. 60 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేగా.. టీంల పాలిట శనిలా మారిన ముగ్గురు..!

IPL 2026 Flop Players: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్నప్పటికీ, కొందరు స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం ఫ్రాంచైజీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా భారీ ధర పలికిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు దారుణంగా విఫలమవ్వడంతో వారిపై కోట్లు కుమ్మరించిన జట్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. దాదాపు 60 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన జట్లకు ఆశించిన ఫలితం దక్కకపోవడం గమనార్హం.

IPL 2026: రూ. 60 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేగా.. టీంల పాలిట శనిలా మారిన ముగ్గురు..!
Srh
Venkata Chari
|

Updated on: Apr 18, 2026 | 9:34 AM

Share

IPL 2026 Flop Players: క్రికెట్‌లో ఎంతటి దిగ్గజ ఆటగాడైనా ఫామ్ లేకపోతే మైదానంలో నిలదొక్కుకోవడం కష్టమని ఐపీఎల్ 2026 మరోసారి నిరూపిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను విశ్లేషిస్తే నికోలస్ పూరన్, కెమెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు పరుగుల కోసం చెమటోడుస్తున్నారు. తమను నమ్మి భారీ వేలం ధర చెల్లించిన యాజమాన్యాలకు వీరు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.

1. కెమెరాన్ గ్రీన్ (కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 25.20 కోట్లు): ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కెమెరాన్ గ్రీన్, కోల్‌కతా జట్టును నిలువునా ముంచేస్తున్నాడు. రూ. 25.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన గ్రీన్, ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 14 సగటుతో 56 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్‌లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గ్రీన్ వైఫల్యంతో కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. తుది జట్టు నుంచి తీసేయలేక, అలాగని ఆడించలేక కేకేఆర్ సతమతమవుతోంది. కాగా, నిన్న గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఫాంలోకి వచ్చాడు. కానీ మిగతా కేకేఆర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

2. నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 21 కోట్లు): కరీబియన్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం లక్నో జట్టు ఏకంగా 21 కోట్ల రూపాయలు వెచ్చించింది. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. బ్యాటింగ్ క్రమంలో జరుగుతున్న మార్పుల వల్ల తన లయను కోల్పోయిన పూరన్, 5 మ్యాచ్‌ల్లో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 8.40గా ఉండటం లక్నో విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఈ పేలవ ఫామ్ కారణంగా లక్నో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

3. ట్రావిస్ హెడ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 14 కోట్లు): సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. రూ. 14 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న ఈ స్టార్ బ్యాటర్, 5 మ్యాచ్‌ల్లో 120 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ పరవాలేదనిపించినా, జట్టుకు కావాల్సిన మెరుపు ఆరంభాలను అందించడంలో హెడ్ విఫలమవుతున్నాడు. దీని ప్రభావం హైదరాబాద్ ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ముగ్గురు ఆటగాళ్ల వైఫల్యం ఐపీఎల్ చరిత్రలో వేలం వ్యూహాలపై మరోసారి చర్చకు దారితీసింది. భారీ ధర చెల్లించినంత మాత్రాన విజయాలు వరించవని, మైదానంలో ప్రదర్శన మాత్రమే ముఖ్యమని ఈ సీజన్ నిరూపిస్తోంది. రానున్న మ్యాచ్‌ల్లోనైనా వీరు పుంజుకుంటారో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు ఏం చేశారంటే
క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు ఏం చేశారంటే
జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ మాములుగా లేదుగా..
జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ మాములుగా లేదుగా..
బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా?
బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా?
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. ప్రభుత్వం మరో అప్డేట్..
తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. ప్రభుత్వం మరో అప్డేట్..
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళా
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళా
నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్!
నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్!
గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?
గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?
వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్
వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్
'నా రక్తం తీయగా ఉందని దోమలు నన్నే ఎక్కువగా కుడుతున్నాయి..'
'నా రక్తం తీయగా ఉందని దోమలు నన్నే ఎక్కువగా కుడుతున్నాయి..'
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!