ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు
ఆగ్రాలో ఓ నవ వధువు పెళ్లి రాత్రి వరుడిని రూ.90 లక్షలు డిమాండ్ చేసి షాకిచ్చింది. నిరాకరించడంతో ఏడాది పాటు వేధించి, చివరకు ఆమె కుటుంబం వరుడి కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు యత్నించింది. కోర్టు ఆదేశాలతో నిందితులపై హత్యాయత్నం, బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదైంది. ఈ దారుణం సమాజంలో వివాహ బంధాల పట్ల ఆందోళన రేకెత్తిస్తోంది.
అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి, నూరేళ్లూ కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ప్రమాణం చేసి వేదమంత్రాలు, పెద్దల ఆశీర్వచనాల మధ్య ఒక్కటైంది ఒక నవజంట. అయితే మొదటి రాత్రి శోభనం గదిలోకి అడుగుపెట్టిన నవ వధువు వరుడికి ఊహించని షాకిచ్చింది. మేలిముసుగు తీయాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించడంతో ఏడాది పాటు వేధించి, చివరకు అతడిని, అతని కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు యత్నించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగుచూసింది. ఆగ్రాకు చెందిన యువకుడికి, కల్పన అనే యువతికి గతేడాది ఏప్రిల్ 29న వివాహమైంది. శోభనం రాత్రి గదిలోకి వెళ్లిన భర్తకు ఆమె ఊహించని షరతు పెట్టింది. తనకు రూ.90 లక్షల నగదు ఇస్తేనే మేలి ముసుగు తీస్తానని మొండికేసింది. అంత పెద్ద మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని భర్త తేల్చి చెప్పడంతో, మరుసటి రోజే ఒంటి మీద ఉన్న నగలతో సహా కల్పన పుట్టింటికి చెక్కేసింది. అప్పటి నుంచి కల్పన కుటుంబ సభ్యులు బాధితుడిని బెదిరించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 26న కల్పన తండ్రి, సోదరుడు వరుడి ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారు. ఇంట్లోని పీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్‌ను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసి నిప్పు అంటించారు. ఈ ప్రమాదంలో వరుడితో పాటు అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడగా, స్థానికులు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు మొదట ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, తాజాగా ఆగ్రా పోలీసులు నిందితురాలు కల్పన మరియు ఆమె కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన జనం
చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత
తల్లిదండ్రులు తినే చపాతీలలో ఎలుకల మందు కలిపిన కూతురు..
JD Chakravarthy: స్లో పాయిజన్ ఇచ్చారు.. చావు అంచులదాకా వెళ్లా..
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన జనం
చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత
తల్లిదండ్రులు తినే చపాతీలలో ఎలుకల మందు కలిపిన కూతురు..
బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??
350 అశ్లీల వీడియోలు..100 మందికి పైగా బాధితులు

