AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్లాడో తెలుసా ?? చివరికి

తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్లాడో తెలుసా ?? చివరికి

Phani CH
|

Updated on: Apr 17, 2026 | 4:51 PM

Share

ప్రొద్దుటూరులో తండ్రి మందలింపుతో 9వ తరగతి బాలుడు 100 కి.మీ సైకిల్‌పై నంద్యాలకు, అక్కడి నుండి రైలులో రాయచూర్‌కు వెళ్లాడు. తప్పిపోయిన కుమారుడిని పోలీసులు సీసీటీవీల సాయంతో సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. ఈ ఘటన పిల్లల మనస్తత్వాలను, వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంది. పిల్లల భద్రత, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.

చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దు అనుకుంటాం కానీ.. మన మీద అలకతో వాళ్లు ఒక్కోసారి చేసే పనులు.. గుండె ఆగిపోయేలా చేస్తాయి. ఈమధ్యనే అలాంటి ఘటన ఒకటి కడప జిల్లాలో జరిగింది. ఈ ఘటన గురించి అందరికీ తెలిసినా.. దాని వెనుక అసలు కారణమేంటి.. పిల్లల విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ బాలుడు తండ్రిపై కోపంతో ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. చిన్న విషయానికే అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ప్రొద్దుటూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు. ఇంట్లో అన్నదమ్ములిద్దరూ గొడవపడటంతో తండ్రి జోక్యం చేసుకుని, 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడిని మందలించారు. దీంతో మనస్తాపానికి, కోపానికి గురైన ఆ బాలుడు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. సైకిల్‌పై నంద్యాల వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని, రాత్రంతా ఎక్కడా ఆగకుండా సైకిల్ తొక్కాడు. రాజుపాళెం, చాగలమర్రి మీదుగా సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి, మరుసటి రోజు ఉదయానికి నంద్యాల చేరుకున్నాడు. అక్కడ ఖర్చుల కోసం తన సైకిల్‌ను అమ్మేందుకు ప్రయత్నించాడు. అయితే, షాపు యజమాని వివరాలు అడగడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నంద్యాల రైల్వేస్టేషన్ సమీపంలో సైకిల్‌ను వదిలేసి, రైలెక్కి కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లాడు. మరోవైపు కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడి వద్ద మొబైల్ లేకపోవడంతో ఆచూకీ కనుక్కోవడం సవాలుగా మారింది. దీంతో సీసీటీవీ ఫుటేజీలను ఆధారం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడు బుక్స్ బ్యాగ్ తగిలించుకుని సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలను గుర్తించి, ఆ మార్గంలోని మరిన్ని కెమెరాలను పరిశీలించారు. బాలుడు నంద్యాల వెళ్లినట్లు నిర్ధారించుకుని, అక్కడి లాడ్జీలు, హోటళ్లలో గాలించారు. చివరకు రైల్వే స్టేషన్ వద్ద అతని సైకిల్‌ను గుర్తించారు. అక్కడి విచారణలో బాలుడు రాయచూర్ వెళ్లినట్లు తెలియడంతో ప్రత్యేక బృందం రాయచూర్ వెళ్లి తన చిన్నాన్న ఇంటికెళ్లిన బాలుడిని సురక్షితంగా ప్రొద్దుటూరు తీసుకొచ్చింది. కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్న విషయానికే ఓ బాలుడు ఇంతటి సాహసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులను పరుగులు పెట్టించినా చివరకు సీసీటీవీ ఫుటేజీలో కనిపించి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..

జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన

ఇంట్లో తిట్టారని వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడిని.. పాతికేళ్లకు ఫేస్‌బుక్‌ కలిపింది

ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌

Published on: Apr 17, 2026 04:43 PM
Follow Us