ఇంట్లో తిట్టారని వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడిని.. పాతికేళ్లకు ఫేస్‌బుక్ కలిపింది
చిన్ననాటి మందలింపుతో ఇంటిని వీడిన ఖమ్మం బాలుడు 25 ఏళ్ల తర్వాత ఫేస్‌బుక్ ద్వారా కుటుంబంతో కలిశాడు. తల్లిదండ్రుల ఆందోళన, పిల్లల అఘాయిత్యాల నేపథ్యంలో, సోషల్ మీడియా మంచికి ఎలా ఉపయోగపడుతుందో ఈ ఘటన చూపిస్తుంది. అయినప్పటికీ, ఈ సంతోషంలో తల్లిని కోల్పోయిన విషాదం మిగిలింది. ఇది సామాజిక మాధ్యమాల సానుకూల, ప్రతికూల ప్రభావాలను ప్రతిబింబిస్తుంది.
ప్రస్తుత కాలంలో పిల్లలను మందలించాలన్నా తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏం అంటే ఏ అఘాయిత్యానికి పాల్పడతారోనని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో.. సెల్ ఫోన్ చూడొద్దన్నారనో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తరచూ నెట్టింట మనం చూస్తున్నాం. తాజాగా ఖమ్మం జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. తల్లిదండ్రులు మందలించారని 13 ఏళ్ల వయసులో ఇల్లు విడిచి వెళ్లిపోయిన బాలుడుని పాతికేళ్లకు ఫేస్‌బుక్ తన కుటుంబంతో కలిపింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మనుషులు చేసే ప్రతి ప్రయోగంలోనూ మంచి, చెడూ రెండూ ఉంటాయి. అలాగే సోషల్ మీడియా వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. ఏదైనా అది మనం ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. సోషల్ మీడియా అన్ని రంగాలవారికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. పండితులు, పామరులు కూడా సోషల్ మీడియాను తమదైనశైలిలో ఉపయోగించుకోవచ్చు. ఇదే సోషల్ మీడియా విడిపోయిన కొన్ని కుటుంబాలను కలిపిన ఘటనలు మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది. పదమూడేళ్ల వయసులో ఇల్లువిడిచి వెళ్లిపోయిన బాలుడిని అతనికి పాతిక సంవత్సరాలు వచ్చాక తల్లిదండ్రులను చేరుకున్నాడు… ఆ యువకుడిని తన కుటుంబంతో కలిపింది మరెవరో కాదు.. ఫేస్ బుక్. అది 2001వ సంవత్సరం.. చిన్న వయసులో ఇంటి సభ్యులు చేసిన చిన్నపాటి మందలింపు ఆ బాలుడి మనసును గాయపరిచింది. ఆ కోపంలోనే చదువు మానేసి, ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి, హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. పాతికేళ్లు గడిచిపోయాయి. కన్నవారు ఆశలు వదులుకున్నారు.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి అలసిపోయారు. కానీ, సామాజిక మాధ్యమం పుణ్యమా అని.. విడిపోయిన ఆ బంధం మళ్లీ ఒక్కటైంది. ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు ముస్లిం బజారుకు చెందిన షేక్ అక్బర్, 2001లో తన 13వ ఏట ఎర్రిపాలెం మండలం బనిగండ్లపాడు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్థలు రావడంతో అలిగి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. అక్బర్ మాత్రం రైలెక్కి ముంబై, పూణే ప్రాంతాలకు చేరుకున్నాడు. అక్కడే కష్టపడి పని చేస్తూ, పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలతో స్థిరపడ్డాడు. అక్కడే జీవనం సాగిస్తున్న అక్బర్‌కు ఇటీవల మొబైల్‌లో ఫేస్‌బుక్ చూస్తుండగా తన కుటుంబ సభ్యుల ఫోటోలు కనిపించాయి. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడాయి. కన్నవారి ప్రేమ ఏమిటో తెలిసి వచ్చింది. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూణే నుంచి బయలుదేరి మంగళవారం తన స్వగ్రామమైన ఖమ్మంపాడుకు చేరుకున్నాడు. ఏమైపోయాడో తెలియక ఇక రాడు అనుకున్న కన్నబిడ్డ పాతికేళ్ల తర్వాత కళ్ల ముందు నిలవడంతో అతని తండ్రి, సోదరుల సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి. పట్టరాని ఆనందంతో గుండెలకు హత్తుకున్నారు. అక్బర్ తిరిగి రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఆనందంలోనే ఒక తీరని విషాదం కూడా చోటుచేసుకుంది. తన రాక కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన తల్లి, కొడుకుపై బెంగతో కొద్దికాలం క్రితమే మరణించిందని తెలుసుకున్న అక్బర్ కన్నీరుమున్నీరయ్యాడు. ఆమెను కడసారి చూడలేకపోయానన్న బాధ అతడిని కలిచివేసింది. సోషల్ మీడియా ప్రజలపై దుష్ప్రభావం చూపుతుందన్న విమర్శల నేపథ్యంలో ఒక కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్ ఇక్కడ వారధిగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన జనం
ఇంట్లో నుండి వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడు.. కట్ చేస్తే FB కలిపింది
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన జనం
చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత
తల్లిదండ్రులు తినే చపాతీలలో ఎలుకల మందు కలిపిన కూతురు..
బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??

