AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన

జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన

Phani CH
|

Updated on: Apr 17, 2026 | 4:39 PM

Share

ఒక ఎంఎన్‌సీ టెకీకి రెండేళ్ల తర్వాత కేవలం 9 రూపాయల జీతం పెరగడం వైరల్ అయింది. ఇది ఐటీ రంగంలో జీతాల స్తబ్దత, కార్పొరేట్ బాండ్ పాలసీల సమస్యలను ఎత్తిచూపింది. తక్కువ జీతం, బాండ్ నిబంధనలతో ఇరుక్కుపోయానని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కార్పొరేట్ కంపెనీల పని విధానంపై విస్తృత చర్చకు దారి తీసింది, ఉద్యోగుల హక్కులు, వేతన పెంపుపై దృష్టి సారించింది.

ప్రముఖ MNCలో పనిచేస్తున్న ఒక టెకీ జీతం కేవలం 9 రూపాయలే పెంచడం నెట్టింట చర్చకు దారి తీసింది. రెండేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తనకు దక్కిన ప్రతిఫలం ఇదేనని, తాను ఓ గొయ్యిలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తోందని ఆ యువకుడు సోషల్ మీడియాలో తన బాధ వెళ్లగక్కాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారి, కార్పొరేట్ కంపెనీల పనివిధానంపై కొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో పనిచేస్తున్న ఆ టెకీ 2024 మే లో ఓ ఎంఎన్‌సీలో ఇంటర్న్‌గా చేరాడు. ఆరు నెలల తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందాడు. ఉద్యోగంలో చేరినప్పుడు అతని వార్షిక ప్యాకేజీ రూ.4.25 లక్షలు. అయితే, గత రెండేళ్లుగా అదే జీతంతో పనిచేస్తున్నాడు. మొదటి సంవత్సరం పనితీరు సమీక్ష తర్వాత అతనికి కేవలం 9 రూపాయలు జీతం పెంచారు. 2025-26 సంవత్సరానికి ఆ పెంపు కూడా కొనసాగకపోవడంతో అతను నిరాశపడ్డాడు. ఉద్యోగంలో చేరినప్పుడు మార్కెట్ పరిస్థితులు బాగోలేక తక్కువ జీతానికే ఒప్పుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. కంపెనీతో అతనికి రెండేళ్ల బాండ్ ఉంది. ఒకవేళ ఉద్యోగం మానేయాలంటే 1.5 లక్షల జరిమానా చెల్లించడంతో పాటు, ఆరు నెలల నోటీస్ పీరియడ్ కూడా పూర్తిచేయాలి. ఈ నిబంధనల వల్లే తను ఇక్కడ చిక్కుకుపోయానని అతను వాపోయాడు. తను బానిసలా కష్టపడుతున్నాననీ ఆఫీసుకు వెళ్లడం, క్లయింట్లను కలవడం, ప్రయాణాలు చేయడం వంటివన్నీ చేస్తున్నాననీ చెప్పుకొచ్చాడు. కానీ ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వడం లేదనీ పైగా, ఆఫీస్ క్యాబ్‌ కోసం తన జీతం నుంచే కట్ చేస్తున్నారని తెలిపాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. “మిమ్మల్ని తక్కువ జీతానికి వాడుకుంటున్నారు. మీరు వెళ్లిపోతే, మీ స్థానంలో మరో వ్యక్తిని ఇంతకంటే తక్కువ జీతానికి నియమించుకోవచ్చని కంపెనీకి తెలుసు” అని ఒకరు కామెంట్ చేయగా, “ముందు మీ నైపుణ్యాలు పెంచుకోండి. అప్పుడే మంచి జీతం, గౌరవం లభిస్తాయి” అని మరొకరు సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఆటోమేషన్, నియామకాల మందగమనం వంటి కారణాలతో జీతాల పెంపు నెమ్మదించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఘటన యువ టెకీలలో జీతాల పెంపు, కంపెనీల బాండ్ విధానాలపై తీవ్ర చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో తిట్టారని వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడిని.. పాతికేళ్లకు ఫేస్‌బుక్‌ కలిపింది

ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌

రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్‌.. భయంతో వణికిపోయిన జనం

చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత

Follow Us