AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

400 కి.మీ. మైలేజ్.. దంచికొట్టే స్పీడ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ తెలిస్తే వావ్ అనాల్సిందే..

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారిని వేధించే ప్రధాన సమస్య ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటి? అనేది. ఆ రేంజ్ ఆందోళనకు చరమగీతం పాడుతూ సింపుల్ ఎనర్జీ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం సిటీ లోపలే కాదు.. ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించేంత రేంజ్‌తో సింపుల్ అల్ట్రా స్కూటర్‌ను విడుదల చేసింది. ఒక్క ఛార్జ్‌తో 400 కిలోమీటర్లు వెళ్లే ఈ సూపర్‌ స్కూటర్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..

400 కి.మీ. మైలేజ్.. దంచికొట్టే స్పీడ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ తెలిస్తే వావ్ అనాల్సిందే..
Simple Ultra Electric Scooter
Krishna S
|

Updated on: Apr 18, 2026 | 9:04 AM

Share

భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో రేంజ్ అనేది ఎప్పుడూ ఒక సవాలే. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ బెంగళూరుకు చెందిన స్టార్టప్ సింపుల్ ఎనర్జీ ఒక సరికొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఎంతో కాలంగా ఈవీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సింపుల్ అల్ట్రా మార్కెట్లోకి విడుదలైంది. దేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా ఇది రికార్డు సృష్టించింది. సింపుల్ అల్ట్రా యొక్క అతిపెద్ద బలం దాని బ్యాటరీ. ఇందులో 6.5 kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది. సాధారణ రోడ్లపై కూడా ఇది సుమారు 300 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇచ్చే అవకాశం ఉండటంతో, సిటీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్స్ చేసే వారికి కూడా ఇది సరైన ఎంపికగా మారింది.

వేగంలోనూ అల్ట్రా స్పీడ్

సాధారణంగా ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్ల వేగం తక్కువగా ఉంటుంది. కానీ సింపుల్ అల్ట్రా విషయంలో అది రివర్స్. ఈ స్కూటర్ గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. కేవలం 2.77 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీంతో ఇది ఓలా S1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి దిగ్గజ స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సింపుల్ వన్ తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన స్కూటర్.

అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు

టెక్నాలజీ పరంగా సింపుల్ అల్ట్రా ఒక స్మార్ట్ గ్యాడ్జెట్‌లా ఉంటుంది. వర్షం పడినప్పుడు లేదా రోడ్లు జారుడుగా ఉన్నప్పుడు స్కూటర్ అదుపు తప్పకుండా ఉండేందుకు 4 స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఇందులో చేర్చారు. 7 అంగుళాల కలర్ డిజిటల్ డిస్‌ప్లే దీనికి ప్రధాన ఆకర్షణ. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.కంపెనీ మెరుగైన భద్రత, మన్నిక కోసం దీనిని తమ సరికొత్త జెన్ 2 ఆర్కిటెక్చర్‌పై నిర్మించింది.

రిటైల్ నెట్‌వర్క్, డెలివరీలు

సింపుల్ ఎనర్జీ తన నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కొచ్చి వంటి మెట్రో నగరాల్లో 70కి పైగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నాగ్‌పూర్, రాంచీ, భువనేశ్వర్ వంటి టైర్-2 నగరాల్లో కూడా తమ టచ్‌పాయింట్లను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ధర ఎంత..?

సింపుల్ అల్ట్రా ప్రీమియం ఫీచర్లు మరియు భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్నందున, దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.2,35,000 గా నిర్ణయించారు. ఇది మార్కెట్లో ఉన్న ఇతర సాధారణ ఈవీ స్కూటర్ల కంటే కొంచెం ఎక్కువ ధర అనిపించినప్పటికీ.. అది ఇచ్చే 400 కిమీ రేంజ్, పికప్‌ను బట్టి చూస్తే సరైనదేనని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us