AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ బాధ కోల్పోయిన వారికే తెలుస్తుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రెజీనా..

తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రెజీనా కసాండ్రా. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. కానీ రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తాజాగా బ్రేకప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Rajitha Chanti
|

Updated on: Apr 18, 2026 | 9:52 AM

Share
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కాసాండ్రా. దాదాపు 20 సంవత్సరాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ, వ్యక్తిగత విషయాల గురించి చాలా అరుదుగా స్పందిస్తుంటుంది.

1 / 5
తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రేమ, గతం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. రెజీనా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రేమ గురించి లోతైన భావాలను పంచుకున్నారు.  "ప్రేమ అనేది బలహీనత కాదు, అదొక ప్రశాంతమైన బలం. ప్రతిరోజూ మన కోసం మనం చిరునవ్వుతో లేచి నిలబడాలి.

2 / 5
ప్రతి ఒక్కరూ ప్రేమను పొందడానికి, పంచడానికి అర్హులనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు" అని పేర్కొన్నారు. ముఖ్యంగా, "ప్రేమించడంలోనూ, ప్రేమించబడడంలోనూ ఉండే అసలైన సంతోషం మనకు ఎందుకు తెలుస్తుందంటే.. ఆ ప్రేమను కోల్పోయినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో మనకు ముందే తెలుసు కాబట్టి" అని ఆమె రాసుకొచ్చారు.

3 / 5
35 ఏళ్ల రెజీనా ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు. గతంలో ఈమె ఒక ప్రముఖ నటుడితో ప్రేమాయణం సాగించిందని, ఆ తర్వాత విడిపోయిందని అప్పట్లో ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా "ప్రేమను కోల్పోవడంలో ఉండే బాధ" గురించి ప్రస్తావించడంతో, ఇది ఆమె సొంత జీవితంలోని అనుభవమేనా? అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

4 / 5
వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా, వృత్తిపరంగా రెజీనా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో 'ఫ్లాష్‌బ్యాక్', 'మూక్కుత్తి అమ్మన్-2' తో పాటు తమిళంలో 'ది వైవ్స్', హిందీలో 'సెక్షన్ 108' వంటి కీలక ప్రాజెక్టులలో నటిస్తున్నారు. కేవలం హీరోయిన్ గానే కాకుండా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ తన సత్తా చాటుతున్న రెజీనా, ఈ లేటెస్ట్ పోస్ట్‌తో తన మనసులోని మాటను ధైర్యంగా బయటపెట్టారు.

5 / 5
Follow Us