AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rayalaseema: కరువు నేలలో జలధార.. బోరు బావి నుంచి తక్కువ లోతులోనే ఎగిసిపడ్డ గంగమ్మ..

కరువు కాటుకు గురైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరుదైన దృశ్యం కనిపించింది. శ్రీ సత్యసాయి జిల్లా కొర్రెవు గ్రామంలో రైతు మాలింగప్ప పొలంలో బోరు వేస్తుండగా కేవలం 470 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు ఉబికి వచ్చి 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడాయి. ఎండిన నేలల్లో ఇలాంటి జలసిరి కనిపించడం స్థానిక రైతుల్లో కొత్త ఆశలను నింపింది.

Rayalaseema: కరువు నేలలో జలధార.. బోరు బావి నుంచి తక్కువ లోతులోనే ఎగిసిపడ్డ గంగమ్మ..
Borewell Water Gush
Nalluri Naresh
| Edited By: |

Updated on: Apr 18, 2026 | 9:41 AM

Share

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఎక్కడ చూసినా ఎండిన నేలలు.. కరువు ఛాయలు.. అడుగంటిన భూగర్భ జలాలు కనిపిస్తాయి.. అలాంటిది నడివేసుకులో శ్రీ సత్యసాయి జిల్లా అమలాపురం మండలం కొర్రెవు గ్రామంలో రైతు మాలింగప్ప బోరు వేస్తుండగా.. భూగర్భం నుంచి ఒక్కసారిగా జలధార ఉబికి వచ్చింది. నీళ్లు ఆకాశాన్ని తాకే అంత ఎత్తున ఎగసిపడుతుంటే ఆ దృశ్యం చూసి స్థానికులు పరవశించిపోయారు.. సాధారణంగా మడకశిర లాంటి ప్రాంతంలో భూగర్భ జలాలు అంత సులభంగా దొరకవు.. వేల అడుగుల లోతుకు వెళ్లిన నీటి జాడ దొరకని పరిస్థితి… అలాంటిది రైతు మాలింగప్ప పొలంలో జరిగిన అద్భుతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన తన పొలంలో బోరు వేయిస్తుండగా… కేవలం 470 అడుగుల లోతులోనే భూగర్భం నుంచి జల ధార ఆకాశానికి ఎగసిపడింది. బోరుబావి నుంచి 15 అడుగుల మేర పైకి నీరు ఎగసిపడుతుంటే చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు… నీళ్లు ఎగసిపడుతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్స్‌లో రికార్డ్ చేసి సంబరపడిపోతున్నారు. కరువు నేలలో దొరికిన ఈ జలసిరిని చూసి గొర్రెవు గ్రామ రైతులు ఇప్పుడు బోరు బావులపై ఆశాజనకంగా కనిపిస్తున్నారు. తక్కువ లోతులోనే మీరు ఎగసిపడటం చూస్తుంటే నిజంగా అద్భుతంగా ఉందని… రైతు మాలింగప్ప కళ్ళలో కొత్త ఆశలను చిగురింపజేసింది.

వీడియో దిగువన చూడండి..

Follow Us