స్టైలిష్ లుక్‌లో పిల్లా నువ్వు లేని జీవితం మూవీ బ్యూటీ.. అదిరిపోయిన ఫోటోస్!
Samatha
17 April 2026
అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొతం.
రెజీనా కసాండ్రా
ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ మాయ చేస్తుంది.
అందం, అభినయం
ఇక ఈ బ్యూటీ SMS, శివ మనసులో శృతి అనే సినిమాతో 2012లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
శివ మనసులో శృతి
ఈ మూవీతోనే ఈ బ్యూటీ మంచి హిట్ అందుకోవడమే కాకుండా, యూత్ మనసు కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో అద్భుతంగా నటించింది.
మంచి గుర్తింపు
దీంతో ఈ మూవీ తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో అనేక అవకాశాలు వచ్చాయి. చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
వరస అవకాశఆలు
ముఖ్యంగా మెగా హీరో సరసన పిల్లా నువ్వు లేని జీవితం మూవీలో నటించి, మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి.
పిల్లా నువ్వు లేని జీవితం
దీని తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్, కొత్త జంట, సౌఖ్యం ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.
వరస సినిమాలు
కానీ మాలీవుడ్, కోలీవుడ్‌లో వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఏ కాస్త సమయం దొరికి సోషల్ మీడియాలో బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా స్టైలిష్ లుక్‌లో ఫొటోలు అభిమానులతో పంచుకుంది.