రుచికరమైన పెరుగు సేమియా.. ఇలా చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే!

Samatha

17 April 2026

సేమియా అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే పెరుగు సేమియా చేసుకొని తింటారు.

సేమియా

అయితే ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే వారికి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఏం చేసుకోవాలో టిఫిన్ అర్థం కాదు.

టిఫిన్స్

అలాంటి వారికే ఈ బెస్ట్ రిసిపీ, చాలా తక్కువ సమయంలో ఇలా పెరుగు సేమియా చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మరి ఇది ఎలా చేయాలి అంటే?

పెరుగు సేమియా

కావాల్సిన పదార్థాలు : పెరుగు, వేడి నీరు, సేమియా, ఉప్పు, కీర దోస, క్యారెట్, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండు మిర్చి, అల్లం తురుము, ఇంగువ, వేరుశనగ గుళ్లు, జీడిపప్పు.

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం : ముందుగా పాన్ పెట్టి, అందులో కొంచెం నెయ్యి వేసి దానిని తక్కువ మంటపై మంచిగా వేయించుకోవాలి.

తయారీ విధానం

తర్వాత అందులో కొన్ని నీరు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన సేమియాను పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత పెరుగు తీసుకొని దానిని మంచిగా కలుపుకోవాలి.

సేమియా ఉడకబెట్టుకోవడం

ఇప్పుడు సేమియాను పెరుగులో వేసి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు , ఎండు మిర్చి , అల్లం తరుగు అన్నీవేసి పోపు పెట్టుకోవాలి.

సేమియా పెరుగు

తర్వాత పోపులో పెరుగు సేమియా కలిపిన మిశ్రమం వేయాలి.  అంతే కమ్మ కమ్మని  పెరుగు సేమియా రెడీ. మరి మీరు ట్రై చేయండి.

సేమియా పెరుగు రెడీ