Anakapalli: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో అర్ధరాత్రి 3.7 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం భూకంప కేంద్రం 20 కి.మీ లోతులో ఉంది. ఆచార్యుల అభిప్రాయం ప్రకారం, ఇది తక్కువ తీవ్రత గల ప్రకంపనం, భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని రాంబిల్లి మండలం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని రాంబిల్లి పరిసర ప్రాంతాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి ఉపరితలానికి సుమారు 20 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.7గా నమోదైంది. ఈ ఘటనపై ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) జియాలజీ ప్రొఫెసర్ యుగంధర్ ఏం చెప్పారంటే.. ప్రజలు భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఈ భూకంపం చాలా తక్కువ తీవ్రత కలిగినదని, భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నందున ఉపరితలంపై పెద్దగా నష్టం వాటిల్లే అవకాశం లేదని తెలిపారు. ఇవి స్వల్ప ప్రకంపనలు మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని పాత్రలు, సామాగ్రి కింద పడ్డాయని, మంచాలు కదిలినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. ప్రకంపనలు తగ్గినప్పటికీ, మళ్లీ వస్తాయేమోనన్న భయంతో చాలా మంది రాత్రంతా నిద్రపోకుండా ఆరుబయటే గడిపారు. ప్రస్తుతానికి ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్లాడో తెలుసా ?? చివరికి
బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..
జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన
ఇంట్లో తిట్టారని వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడిని.. పాతికేళ్లకు ఫేస్‌బుక్ కలిపింది
తండ్రిపై కోపం.. 100KM సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్లాడో తెలుసా
బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..
జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన
ఇంట్లో నుండి వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడు.. కట్ చేస్తే FB కలిపింది
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన జనం

