నిర్మల్ జిల్లా అనంతపేట సర్పంచ్ మాదాస్తు సునీత అక్క మా ఊరి బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఆడబిడ్డ పుట్టిన ప్రతి చిన్నారి పేరు మీద రూ.5,000 బ్యాంకులో డిపాజిట్ చేసి, భవిష్యత్తు అవసరాలకు తోడ్పాటు అందిస్తారు. అదనంగా, రెండు శ్రీగంధం చెట్లను కూడా అందిస్తున్నారు. ఇది సర్పంచ్ సొంత నిధులతో అమలు చేస్తున్న ప్రశంసనీయమైన కార్యక్రమం.