AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, సానుకూల శక్తి పెరుగుతుందని మనందరి నమ్మకం. అందుకే ఇంటా అలంకరణలో ఈ మొక్కకు ప్రాధాన్యత ఇస్తుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను పెంచేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే, అది ప్రయోజనానికి బదులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. మనీ ప్లాంట్ విషయంలో చాలామంది చేసే 5 సాధారణ తప్పులు, వాటి వల్ల కలిగే వాస్తు దోషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Apr 18, 2026 | 8:45 AM

Share
తప్పుడు దిశలో ఉంచడం: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఉంచే దిశ చాలా ముఖ్యం. చాలామంది ఈశాన్య దిశను శుభప్రదంగా భావిస్తారు కానీ, ఈ మొక్కను ఈశాన్యంలో ఉంచడం అత్యంత అశుభం. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో  ఉంచాలి. ఈ దిశ అగ్ని తత్వానికి సంబంధించింది, ఇది ఇంట్లో శ్రేయస్సును పెంపొందిస్తుంది.

1 / 5
తీగలు నేలపై పాకడం:  మనీ ప్లాంట్ తీగలు నేలకు తగలడం లేదా కిందకు పాకడం అశుభ సంకేతం. వాస్తు ప్రకారం, తీగలు పైకి పెరగడం పురోగతిని సూచిస్తుంది. ఒకవేళ తీగలు కిందకు ఉంటే ఆర్థిక నష్టాలు, పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. అందుకే, మొక్క తీగలను ఎప్పుడూ ఒక ఆధారం లేదా గోడ సహాయంతో పైకి పెరిగేలా చూడాలి.

2 / 5
ప్లాస్టిక్ కుండల వాడకం: మనీ ప్లాంట్‌ను ప్లాస్టిక్ కుండల్లో లేదా మురికిగా ఉన్న పాత్రల్లో నాటడం వల్ల దాని శక్తి తగ్గుతుంది. ప్లాస్టిక్ సహజమైనది కాదు కాబట్టి ఇది సానుకూల శక్తిని ఆకర్షించలేదు. ఈ మొక్కను ఎల్లప్పుడూ మట్టి కుండలో లేదా నీలి రంగు గాజు సీసాలో పెంచడం అత్యంత శుభప్రదం. నీలం రంగు శక్తిని సమతుల్యం చేసి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది.

3 / 5
ఎండిన ఆకులను నిర్లక్ష్యం చేయడం: మొక్కలోని ఆకులు పసుపు రంగులోకి మారినా లేదా ఎండిపోయినా వాటిని వెంటనే తొలగించాలి. ఎండిన ఆకులు ఇంట్లో ప్రతికూలతకు, అనారోగ్యానికి సంకేతం. మొక్కను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ, పచ్చని ఆకులతో కళకళలాడేలా చూసుకోవడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది.

4 / 5
ఇతరులకు కొమ్మలను ఇవ్వడం: చాలామంది తమ ఇంట్లోని మనీ ప్లాంట్ కొమ్మలను స్నేహితులకు లేదా బంధువులకు ఇస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం.. మీ ఇంట్లోని మనీ ప్లాంట్‌ను ఇతరులకు ఇవ్వడం అంటే మీ ఇంటి లక్ష్మిని లేదా శ్రేయస్సును ఇతరులకు ఇచ్చినట్లే అని అర్థం. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి, మనీ ప్లాంట్ కొమ్మలను ఇతరులకు ఇవ్వకపోవడమే ఉత్తమం.

5 / 5
Follow Us