Surya : మరోసారి హిట్టు కాంబో రిపీట్.. ఈసారి సెన్సేషనల్ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. దెబ్బకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
విలక్షణ నటుడు సూర్య , దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలయికలో మరో పవర్‌ఫుల్ సోషల్ డ్రామా సిద్ధమవుతోంది. 'జై భీమ్' వంటి సంచలన విజయం తర్వాత వీరిద్దరూ మళ్లీ చేతులు కలుపుతుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. జ్ఞానవేల్ చెప్పిన సామాజిక అన్యాయాలపై గళమెత్తే బలమైన కథకు సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం 'కరుప్పు' (వీరభద్రుడు) షూటింగ్‌లో బిజీగా ఉన్న సూర్య, తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే ఈ క్రేజీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో సూర్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కేవలం కమర్షియల్ హిట్ల కోసమే కాకుండా, సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించే కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. అలాగే తనదైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు సూర్య. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తాజాగా సూర్య కొత్త సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో సూర్య మరోసారి చేతులు కలుపుతున్నారు సూర్య.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..
లాక్‌డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ‘జై భీమ్’ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అట్టడుగు వర్గాల హక్కుల కోసం, పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడే లాయర్ చంద్రు పాత్రలో సూర్య నటన అద్భుతమనే చెప్పాలి. ఈ చిత్రం కేవలం సినిమాగానే కాకుండా, ఒక సామాజిక ఉద్యమంలా సాగింది. ఇప్పుడు అదే దర్శకుడితో సూర్య మళ్ళీ పని చేయబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు టీజే జ్ఞానవేల్ మరో పవర్‌ఫుల్, సామాజిక బాధ్యతతో కూడిన కథను సిద్ధం చేశారు. ఈ స్క్రిప్ట్ పాయింట్ సూర్యకు విపరీతంగా నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా సమాజంలోని కొన్ని కీలకమైన, బలమైన అంశాలను స్పృశిస్తూ సాగనుంది.
ఎక్కువ మంది చదివినవి : Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..
ఇటీవలే రజనీకాంత్‌తో ‘వేట్టయాన్’ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన జ్ఞానవేల్, ఇప్పుడు సూర్య కోసం ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారు. సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 45వ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) షూటింగ్ పూర్తి చేసుకుంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మే 14, 2026న విడుదల కానుంది. దీని తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ & సన్స్’ అనే ఫ్యామిలీ డ్రామాలో సూర్య నటించనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే టీజే జ్ఞానవేల్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ కాంబోలో రాబోయే సినిమా గురించి మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఏం సినిమా రా బాబూ.. పేరుకే పక్కా కామెడీ మూవీ.. కానీ 15 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ..
