AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లా కోర్సుల్లో ప్రవేశాలకు CLAT 2027 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ పూర్తి వివరాలు

దేశంలోని నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే CLAT 2027 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, పరీక్షను డిసెంబర్ 6న నిర్వహించనున్నారు. అర్హతలు, దరఖాస్తు ఫీజు, ముఖ్యమైన తేదీలను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ ప్రకటించింది..

లా కోర్సుల్లో ప్రవేశాలకు CLAT 2027 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ పూర్తి వివరాలు
CLAT Online registration
Srilakshmi C
|

Updated on: Aug 03, 2026 | 3:15 PM

Share

హైదరాబాద్, ఆగస్ట్ 3: నేషనల్ లా యూనివర్సిటీల్లో (NLUs) 2027-28 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్’ (CLAT) 2027 దరఖాస్తు ప్రక్రియ నేటి (ఆగస్ట్ 3) నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక CLAT 2027 పరీక్షను డిసెంబర్ 6, 2026 (ఆదివారం) నిర్వహించనున్నారు. పరీక్ష ఒకే షిఫ్ట్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ (పెన్-అండ్-పేపర్) విధానంలో జరుగుతుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు రూ.4,000, ఎస్సీ / ఎస్టీ / బీపీఎల్ / దివ్యాంగ (PwD) అభ్యర్థులు రూ.3,500 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను పొందాలనుకునే అభ్యర్థులు అదనంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది దరఖాస్తు ఫీజులో భాగం కాదు.. విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

క్లాట్‌ 2027 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

యూజీ (UG) కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఇంటర్మీడియట్ (10+2) లేదా సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (PwD) అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 2027లో జరిగే అర్హత పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ (PG) కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎల్‌ఎల్‌బీ (LL.B.) లేదా సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే అర్హులు. 2027లో ఎల్‌ఎల్‌బీ ఫైనల్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ నేషనల్ లా యూనివర్సిటీల (NLUs)లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు CLAT అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్ష. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 3, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2026.
  • క్లాట్‌ 2027 రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 6, 2026 (ఆదివారం).
  • రాత పరీక్ష సమయం: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

క్లాట్‌ 2027 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us